అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ఎంపిక చేశారు సెలెక్టర్లు. 15 మంది సభ్యులతో కూడిన పటిష్ట జట్టును అందుకు ఎంపిక చేశారు. టీమిండియా ప్రధాన పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ తిరిగిరాగా, ఆసియా కప్ టోర్నీలో విఫలమైన అవేశ్ ఖాన్ ను జట్టు నుంచి తప్పించారు. దాదాపు ఆసియా కప్ టోర్నీలో పాల్గొన్న ఆటగాళ్లకే ఇక్కడా చోటు కల్పించారు. కాగా, ఎప్పటిలాగానే రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్ ను పక్కన పెట్టేశారు సెలెక్టర్లు.
T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (కీపర్), దినేష్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.
స్టాండ్ బై ప్లేయర్స్: మహమ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్.