విరాట్ కోహ్లీ టీమిండియా రన్ మెషిన్, రాహుల్ ద్రావిడ్ దివాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, గంభీర్ రెండు వరల్డ్ కప్స్‌లో గుర్తింపు దక్కని హీరో.. ఇలాంటి హేమహేమీలు చేయలేనిది.. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేశాడు. భారత్-సౌతాఫ్రికా మధ్య సోమవారం ప్రారంభమైన రెండో టెస్టులో బ్యాటింగ్‌కు వచ్చిన బుమ్రా చివర్లో ఒక సిక్సు, రెండు బౌండరీలతో 14 పరుగుల చేశాడు. దీంట్లో బుమ్రా కొట్టిన సిక్స్ హైలెట్‌గా నిలిచింది. కొట్టింది ఒక్క సిక్స్ మాత్రమే కానీ.. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దానికి కారణం.. కోహ్లీ, ద్రావిడ్, పుజారా, గంభీర్ ఇంతవరకు సౌతాఫ్రికాలో ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. కానీ బుమ్రా ఒక్క సిక్స్ కొట్టి హైలెట్ అయిపోయాడు. దిగ్గజ బ్యాటర్ల బ్యాట్ నుంచి రాని సిక్స్ బౌలర్ బ్యాట్‌నుంచి రావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. కగిసో రబడా బౌలింగ్‌లో అతను వేసిన షార్ట్ పిచ్ బాల్‌ను ఫైన్ లెగ్ మీదుగా సిక్స్ బాదిన బుమ్రా అందర్నీ ఆశ్చర్యపరిచాడు. భారత ఇన్నింగ్స్‌లో బుమ్రా ఒక్కడే సిక్స్ కొట్టడం విశేషం. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్లు మార్కో జాన్సెన్(4/31), కగిసో రబడా(3/64), ఒలివియర్(3/64) సమష్టిగా చెలరేగడంతో భారత బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్(133 బంతుల్లో 9 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. రవిచంద్రన్ అశ్విన్(50 బంతుల్లో 6 ఫోర్లతో 46) విలువైన పరుగులు చేశారు. ఈ ఇద్దరూ మినహా మిగతా బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు.
In South Africa [Tests]
Jasprit Bumrah 🐐 has more 6s than:Rahul Dravid
Virat Kohli
Alastair Cook
Steve Waugh
Inzamam Ul Haq
Michael Clarke
Allan Border— * (@5slipsandagully) January 4, 2022
అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. క్రీజులో పీటర్సన్(39 బంతుల్లో 2 ఫోర్లతో 14 బ్యాటింగ్), డీన్ ఎల్గర్(57 బంతుల్లో ఫోర్‌తో 11 బ్యాటింగ్) ఉన్నారు. ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్(12 బంతుల్లో 7)మరోసారి విఫలమయ్యాడు. షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మరి బుమ్రా సిక్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs SA 1st Test: పుజారా డకౌట్! డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ ద్రావిడ్ రియాక‌్షన్..
— Lodu_Lalit (@LoduLal02410635) January 3, 2022