టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. ఇంతవరకు ఏ భారత బౌలర్‌కు సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత్ తరుపున విదేశాల్లో అత్యంత వేగంగా 100 టెస్టు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. సెంచూరియాన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో వాన్ డెర్ డస్సెన్‌ని ఔట్ చేసిన బుమ్రా ఈ ఘనత సాధించాడు.
ఈ రికార్డును బుమ్రా కేవలం 43 ఇన్నింగ్స్‌లోనే తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 25 టెస్ట్‌లు ఆడిన బుమ్రా మొత్తంగా 105 వికెట్లు పడగొట్టాడు. అయితే బుమ్రా సాధించిన 105 వికెట్లలో 101 విదేశాల్లోనే పడగొట్టడం విశేషం. మరి బుమ్రా నెలకొల్పిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సేమ్ టూ సేమ్ బుమ్రా లాగే బౌలింగ్ చేస్తున్నాడు! ఎవరబ్బా ఇతను?
Jasprit Bumrah made a new record in Test cricket on foreign soil https://t.co/aBFmY1SD84
— India360 newz (@India360Newz) December 29, 2021