ప్రస్తుతం యువ క్రికెటర్లతో కూడిన టీమిండియా జింబాబ్వే టూర్‌లో ఉంది. మూడు వన్డేల సిరీస్ కోసం అక్కడికి వెళ్లిన టీమిండియా తొలి వన్డే గురువారం ఆడనుంది. కానీ.. ప్రస్తుతం అందరి చూపు ఆసియా కప్‌లో జరిగిన భారత్-పాకిస్థాన్‌పైనే ఉంది. ఈ మ్యాచ్‌పైనే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఆ మాత్రం ఆసక్తి ఉండటం సర్వసాధారణం. మరీ హైఓల్టేజ్ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది.
ఇదే విషయంపై ఏకంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే స్పందించాడు. ఆసియా కప్ కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అలాగే గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో లీగ్ మ్యాచ్‌లో పాక్ చేతిలో తాము ఓడిపోయిన మాట నిజమే అయినా.. ఆసియా కప్‌లో అలా జరగదని అన్నాడు. అప్పటికీ జట్టులో చాలా మార్పు వచ్చిందని, అక్కడి పరిస్థితి, ఆసియా కప్‌లో పరిస్థితి వేరని పేర్కొన్నాడు.
కాగా.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో పాక్‌తో తలపడింది. ఇప్పుడు టీమిండియాను రోహిత్ శర్మ నడిపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే జట్టులో మొహమ్మద్ షమీని కాకుండా.. యువ పేసర్ ఆవేశ్ ఖాన్‌ను తీసుకోవడంపై కూడా రోహిత్ స్పందించాడు. టీమిండియా సీనియర్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ జట్టులో శాశ్వతంగా ఉండరు కాదా.. అందుకే యువ బౌలర్లకు కూడా అవకాశం ఇవ్వాలి. అప్పుడు జట్టు బెంచ్ కూడా బలపడుతుంది అని రోహిత్ పేర్కొన్నాడు.
ఆసియా కప్ కోసం టీమిండియా ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లను తీసుకుంది. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు తోడుగా అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ ఉన్నారు. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా, యువ బౌలర్ హర్షల్ పటేల్ గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమయ్యారు. కాగా.. షమీని జట్టులోకి తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మరి ఆవేశ్ ఖాన్‌ను తీసుకోవడంపై రోహిత్ సమర్థన గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma is not concerned about the future of ODI cricket just yet 🏏
Read more 👉 https://t.co/3ctKIhajbk pic.twitter.com/GLRjP7NjOd
— ESPNcricinfo (@ESPNcricinfo) August 17, 2022
ఇది కూడా చదవండి: వాటికి ఎలాంటి ఢోకా లేదు! నాకైతే ఇంకో ఫార్మాట్ కావాలి: రోహిత్ శర్మ