ఐపీఎల్ 2022 సీజన్ మరీ ఉత్కంఠగా, మరోవైపు సదరు ఐపీఎల్ అభిమానికి కాస్త కష్టంగా సాగుతోంది. ఎందుకంటే ఐపీఎల్ మొత్తంలో అత్యధిక ట్రోఫీలు సొంతం చేసుకున్న రెండు జట్లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై పరిస్థితి దారుణంగానే కొనసాగుతోంది. చెన్నైతో పోలిస్తే ముంబే ఇండియన్స్ పరిస్థితి మరీ కష్టంగా మారింది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లో ఓటమిపాలయ్యారు. గురువారం చెన్నైతో ఆడిన మ్యాచ్ లోనూ అదే ఫలితం వచ్చింది. అయితే ఇప్పుడు ముంబై- చెన్నై మ్యాచ్ లో కనిపించిన విండీస్ ఆటగాళ్ల బ్రోమ్యాన్స్ దృశ్యం గురించే సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.]
ఇదీ చదవండి: IPL లైవ్ ఫ్రీగా చూసేందుకు హాట్ స్టార్ నే హ్యాక్ చేశాడు!
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై.. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్ ను ఎంతో సునాయాసంగా కూల్చేసింది. 14వ ఓవర్ వేసేందుకు బాల్ బ్రావో తీసుకున్నాడు. బ్రావో కాస్త కట్టడిగానే బాలింగ్ చేసినా.. పొలార్డ్- తిలక్ వర్మా ఆ ఓవర్ లో 10 పరుగులు రాబట్టారు. బ్రావో వేసిన ఆఖరి బాల్ ను పొలార్డ్ డిఫెండ్ చేశాడు. ఆ బాల్ బ్రావో చేతికి అందగా పొలార్డ్ పైకి త్రో బ్యాక్ చేశాడు. వెంటనే పొలార్డ్ కొట్టేందుకు ప్రయత్నించగా బాల్ మిస్ అవుతుంది. వెంటనే బ్రావో, పొలార్డ్ ఒకరి మీదకు ఒకరు వెళ్లారు. అంతా అక్కడ ఏదో జరగబోతోందని భయంతో చూస్తుండిపోయారు. కానీ, పొలార్డ్ బ్రావోకి ముద్దు పెట్టి తిలక్ వైపు వెళ్లాడు. ఆ దృశ్యం చూసిన ప్రేక్షకులు వారి స్నేహానికి ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానిక 155 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 43 బంతుల్లో 51 పరుగులు చేసి.. టీమ్ కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. సూర్యకుమార్ యాదవ్ 21 బంతుల్లో 32 పరుగులు చేశాడు. రోహిత్, ఇషాన్ కిషన్ డకౌట్‌గా పెవిలియన్ చేరారు. చెన్నై బౌలర్ ముఖేశ్ చౌదరికి 3 వికెట్లు దక్కాయి. చెన్నై టీమ్ నుంచి అంబటి రాయుడు 40 పరుగులు చేయగా.. ధోనీ తనదైన స్టైల్ లో మ్యాచ్ ఫినిష్ చేశాడు. ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో ఓటమి నమోదైంది. రోహిత్ శర్మ కెప్టెన్ గా విఫలమయ్యాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.