వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఎంత గొప్ప క్రికెటరో క్రికెట్ అభిమానులందరికీ తెలిసిందే. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ తరపున కొన్ని ఏళ్లుగా అద్భుత ప్రదర్శన కనబర్చిన ఈ కరేబియన్ క్రికెటర్‌ను 2022 ఐపీఎల్ కోసం సీఎస్‌కే రిటైన్ చేసుకోలేదు. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ మెగా వేలంలో బ్రావో అందుబాటులో ఉండనున్నాడు. కాగా బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటివల గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్ మరికొన్ని లీగ్‌లలో మాత్రం పాల్గొననున్నాడు. కాగా బ్రావోకు సంబంధించిన ఒక బిగ్ సీక్రెట్‌ను సీఎస్‌కే ప్లేయర్ దీపక్‌చాహర్ బయటపెట్టాడు.
చాహర్ ఇటివల హిందీలో బాగా ఆదరణ పొందిన ఒక కామెడీ షోలో పాల్గొన్నాడు. ఈ సమయంలో బ్రావో గర్ల్‌ఫ్రెండ్స్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పాడు. బ్రావోకు ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నట్లు చెప్పాడు. ఐపీఎల్ సీజన్‌లో ప్రతి ఏడాది ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్‌తో బ్రావో ఇండియా వచ్చేవాడని చాహర్ పేర్కొన్నాడు. కాగా దీపక్ చాహర్ కూడా ఐపీఎల్ 2021 సీజన్‌లోనే ఫైనల్ అనంతరం తన గర్ల్‌ఫ్రెండ్‌కు గ్రౌండ్‌లోనే ప్రపోజ్ చేసిన విషయం తెలిసిందే. మరి బ్రావోకు ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: గ్రౌండ్ లోనే దీపక్ చాహర్ ప్రపోజల్.. వీడియో వైరల్