బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు అంతా సిద్ధమైంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సమరం ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు నెట్స్‌లో చెమటలు చిందిస్తున్నారు. మరీ ముఖ్యంగా సిరీస్ ఆరంభానికి పది రోజుల ముందుగానే భారత్‌లో ల్యాండైన ఆసీస్ ఆటగళ్లు గంటల తరబడి.. ప్రాక్టీస్ చేస్తున్నారు. వారి ప్రధాన లక్ష్యం.. భారత స్పిన్ త్రయాన్ని ఎదుర్కోవడమే. అందుకోసం వారు పడుతున్న పాట్లు అన్నీ.. ఇన్నీ కావు. గెలవడానికి ఆసీస్ పెద్ద ప్లానే వేసినట్లు తెలిసేలా వారు ప్రాక్టీస్ చేస్తున్న పిచ్‌ల ఫోటోలు బయటకొస్తున్నాయి.
ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ ఎప్పుడు సమరమే. ఇరు జట్లలో అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉండడం, స్లెడ్జింగ్, గొడవలు మ్యాచుపై అభిమానులకు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఏ సెషన్ లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఊహించడం కష్టం. ఫాస్ట్ పిచ్‌లపై చెలరేగి ఆడే ఆసీస్ ఆటగాళ్లకు భారత స్పిన్ పిచ్‌లను ఎదుర్కోవడం అతి పెద్ద సవాల్. అందులోనూ రోజులు గడిచే కొద్దీ.. బాల్ బొంగరంలా తిరుగుతూ ఉంటుంది. అందువల్ల అశ్విన్, జడేజా, అక్సర్ పటేల్ త్రయాన్ని ఎదుర్కోవడం కోసం ఆసీస్ బ్యాటర్లు నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పటికే, అశ్విన్ బౌలింగ్ యాక్షన్ ను పోలి ఉన్న మహేష్ పితియా ఓ యువ క్రికెటర్‌ను తమ నెట్ బౌలర్‌గా నియమించుకున్న ఆస్ట్రేలియా, మరో మాస్టర్ ప్లాన్ వేసింది.
How are the Aussies preparing for @ashwinravi99 ahead of their upcoming Test series with India? Well, they’ve only gone and flown in a near carbon copy of the star off-spinner as a net bowler | #INDvAUS pic.twitter.com/l9IPv6i43j
— cricket.com.au (@cricketcomau) February 3, 2023
గత సిరీస్ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని స్పిన్ అటాకింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవాలని అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్ చేస్తోంది. అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్ చేస్తే టీమిండియా స్పిన్నర్ల బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చనేది వారి గేమ్‌ప్లాన్. ప్రస్తుతం ఆసీస్ జట్టు కర్ణాటకలోని ఆలూరు క్రికెట్ స్టేడియంలో తమ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు. ఆసీస్ జట్టు కోరిక మేరకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్‌లో ఉన్న మూడు పిచ్‌లపై స్పిన్ ట్రాక్‌నే రూపొందించారు.
Australia got to work on tailor-made turning tracks during their two-day training in Sydney, and are looking forward to similar practice pitches when they arrive in Bengaluru 🛬 #INDvAUS
— ESPNcricinfo (@ESPNcricinfo) January 30, 2023
ఆసీస్ బ్యాటర్లు ప్రాక్టీస్ చేస్తున్న పిచ్‌లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో.. ఆ ఫోటోలు చూసిన అభిమానులు ఇదేంటి అన్నట్లుగా ముక్కున వేలేసుకుంటున్నారు. అగ్రశ్రేణి జట్టైనా ఆస్ట్రేలియా, స్పిన్ బౌలింగ్‌కు ఇంత భయపడుతుందా..! అని కామెంట్ చేస్తున్నారు. కాగా, ఆస్ట్రేలియా చివరిసారి 2017లో భారత్ లో పర్యటించింది. ఈ టూర్ లో 4 మ్యాచుల టెస్టు సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో 33 పరుగులు భారీ విజయాన్ని అందుకున్న కంగారూల జట్టు.. రెండవ, నాల్గవ టెస్టుల్లో పరాజయం పాలైంది. ఈసారి అందుకు బదులుతీర్చుకోవాలన్నది వారి ప్రధాన టార్గెట్. ఆసీస్ ఆటగాళ్ల వ్యూహం సరైనదేనా..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The picture of the doctored pitch from the Australian camp for four days at Alur as part of their preparation for the upcoming four-match test series against India took over social media.https://t.co/MPMrz9sADZ
— Express Sports (@IExpressSports) February 4, 2023