బాంబులను హోలీ రంగుల్లా చల్లుకునే పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడేందుకు కొన్నేళ్లుగా ఏ జట్టు సాహసించడంలేదు. కానీ.. 17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టింది. అంతకు ముందే.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టీ20 జట్టు వచ్చి సిరీస్‌లు ఆడివెళ్లాయి. కానీ.. టెస్టు సిరీస్ కోసం చాలా రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుండటంతో పాక్‌లో టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ టీమ్ కూడా భయపడుతూనే వచ్చింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తొలి టెస్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్న ఇంగ్లండ్ టీమ్‌పై పిడుగులాంటి వార్త ఒకటి వచ్చి పడింది. అదే.. పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి. ఈ వార్తతో ఇంగ్లీష్ టీమ్ ఉలిక్కిపడింది.
రేపటి నుంచి ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పాక్‌లోని క్వెట్టాలో పోలీసుల వాహనంపై ఆత్మాహతి దాడి జరిగింది. ఈ భారీ బాంబు పేలుడులో ఒక పోలీస్ అధికారి సహా.. ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు సమాచారం. అలాగే పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. పోలీయో వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌లో పాల్గొన్న వ్యక్తుల సంరక్షణలో ఉన్న పోలీసుల వాహనంపై ఈ దాడి జరిగింది. ఈ దాడితో ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు మొత్తం రావాల్పిండిలోని ఇంటర్నేషనల్ స్టేడియంలో సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.
అయితే.. ఈ దాడి నేపథ్యంలో ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే సందిగ్ధత నెలకొంది. సిరీస్ రద్దు చేసుకుని హుటాహుటిన ఇంగ్లండ్‌కు ప్రయాణ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఏడాది క్రితం పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడేందుకు పాక్ గడ్డపై అడుగుపెట్టిన న్యూజిలాండ్ జట్టు.. భద్రతా కారణాలతో మ్యాచ్ ఆరంభానికి కొన్ని నిమిషాల ముందు సిరీస్ రద్దు చేసుకుని స్వదేశం వెళ్లిపోయిన విషయం తెలిసిందే. కానీ.. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు పాక్‌లో సిరీస్‌లు ఆడాయి. వరల్డ్ కప్‌కు ముందు ఇంగ్లండ్ జట్టు పాక్‌లో 7 టీ20లు ఆడి 4-3తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. మరీ.. రేపటి నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ జరుగుతుందో లేదో చూడాలి.
A suicide bomb blast has struck a #Pakistani police vehicle in the southwestern Pakistani city of #Quetta, killing at least 5 killed and wounding dozens.#Pakistani Taliban claimed responsibility for Wednesday’s attack . #Baluchistan #Pakistan
— Abdulhaq Omeri (@AbdulhaqOmeri) November 30, 2022