క్రికెట్ అంటే ఇండియాలో ఒక ఎమోషన్ అని అందరికీ తెలిసిందే. ఇండియాలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ మరే ఆటకు ఉండదు. ప్రపంచంలో కూడా ఇప్పుడు క్రికెట్ ఆదరణ పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రేమ కాకుడాం ఐపీఎల్ లాంటి లీగ్‌లను బాగా ప్రోత్సహిస్తున్నారు. అయితే క్రికెట్‌లో సాధారణంగా రెండు జట్లలో ఒకటి విజయం సాధిస్తూ ఉంటుంది. అంతవరకు అంతా బాగానే ఉంటుంది. అలా విజయం సాధించే క్రమంలో మ్యాచ్‌లో కొన్ని ఫన్నీ మూమెంట్స్, కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లో అరె ఇలా కూడా ఆడతారా? ఇలా కూడా ఆలోచిస్తారా? అని మీరు నోరెళ్లబెట్టే కొన్ని సందర్భాల గురించి ఇప్పుడు చూద్దాం.
టీమిండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. పాకిస్తాన్ ప్లేయర్లు రన్ తీసేందుకు ప్రయత్నించారు. అయితే టీమిండియా ఫీల్డర్ బాల్‌ను నాన్ స్ట్రైకర్ ఎండ్‌కు త్రే చేయగా.. అది తప్పించుకునేందుకు పాక్ బ్యాటర్ గాల్లోకి ఎగిరాడు. అయితే బాల్ నేరుగా స్టంప్స్ కు తాకడంతో అతను అవుట్‌గా పెవిలియన్ చేరాడు.
ఇలాంటి ఘటనలు ఉమెన్ క్రికెట్‌లోను జరుగుతూనే ఉంటాయి. ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్- వెస్టిండీస్ ఉమెన్ టీమ్ మధ్య జరిగిన ఒక పోరులో బౌలర్ సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం వల్ల ఈజీ వికెట్‌ను ఆ జట్టు కోల్పోవాల్సి వచ్చింది. ఫీల్డర్ బంతి విసరగా.. నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో బ్యాటర్ లేరు. కానీ, ఆ బౌలర్ బంతిని కీపర్‌కు త్రో చేసింది. దాంతో ఈజీ రనౌట్‌ని చేయలేక వికెట్ పొందలేకపోయారు.
కరేబియన్ లీగ్ మ్యాచ్‌లో మరో అద్భుతమైన ఘటన జరిగింది. అందులో ప్రత్యర్థులు రనౌట్ చేయలేదని మిస్బా కూడా అసహనం వ్యక్తం చేశాడు. బౌలర్ వేసిని మిస్బా టీమ్ ప్లేయర్ డిఫెండ్ చేస్తాడు. అప్పుడు తను రన్‌కు పరుగెడతాడు. ఆ సమయంలో కీపర్ బంతిని విసరగా ఫీల్డర్ అందుకునే ప్రయత్నం చేయడు. అప్పటికీ మిస్బా క్రీజులోకి రాడు. మరో ఫీల్డర్ బంతిని విసిరినా కూడా ప్లేయర్ పట్టించుకోడు. దాంతో మిస్బా రనౌట్ కాకుండా సేవ్ అయ్యాడు.
టీమిండియా- వెస్టిండీస్ మ్యాచ్‌లో అశ్విన్ రనౌట్ కావాల్సింది సేవ్ అవుతాడు. స్ట్రైకర్ బాల్‌ని హిట్ చేయగా.. బౌండరీ పోతుందనుకున్న బాల్‌ని ఫీల్డర్ పట్టుకుంటాడు. నిజానికి అక్కడ సింగిల్ మాత్రమే వస్తుంది. కానీ, స్ట్రైకర్- అశ్విన్ ఇద్దరూ రెండో రన్ తీసుకోవడానికి ట్రై చేశారు. అశ్విన్ రెండో రన్‌కు రావడం దాదాపుగా అసాధ్యమైంది. కానీ, బంతిని అందుకున్న బౌలర్ రనౌట్ చేయకుండా ఎందుకో అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ గ్యాప్‌లో అశ్విన్ డైవ్ చేసి క్రీజులోకి వచ్చేస్తాడు.
శ్రీలంక- టీమిండియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఆ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ అతి ఆత్మవిశ్వాసంతో తన వికెట్‌ని కోల్పోయాడు. సెహ్వాగ్ బౌలర్ వేసిన బంతిని షాట్ ఆడతాడు. బౌండరీ మీద ప్లేయర్ దానిని అందుకుంటాడు. సెహ్వాగ్ చిన్నగా రన్ తీసుకోవడానికి వెళ్తాడు. అయితే ఎంతో నిదానంగా నడుస్తూ వెళ్తూ ఉండగా. శ్రీలంక ప్లేయర్ బంతిని వికెట్స్ కు విసురుతాడు. సెహ్వాగ్ ఇంకా క్రీజులోకి వెళ్లకపోవడంతో అది కాస్తా రనౌట్ అయ్యింది.
బంగ్లాదేశ్ ఆటగాడు మెహిడీ హసన్ మీర్జా అయితే దారుణంగా ట్రోల్‌కి గురయ్యాడు. అంతేకాదు అతని శ్రద్ధ మైదానంలో లేకపోవడం వల్ల గట్టిగా బంతి దెబ్బ తినాల్సి వచ్చింది. బౌలర్ వేసిన ఓ స్పీడ్ బాల్‌ను బ్యాట్స్‌మన్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. అది నేరుగా ఫీల్డర్ మెహిడీ మీదకు వెళ్లింది. అతను అప్పడు బాల్‌ని చూడకుండా ఎటో చూస్తూ ఉన్నాడు. ఆ బాల్ అతని చెస్ట్‌కి తాకి నొప్పితో గ్రౌండ్‌లో విలవిల్లాడాడు.
కోహ్లీ ఫీల్డింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కోహ్లీ మొదటి నుంచీ ఫీల్డింగ్‌లో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఎంత దూరం నుంచైనా గురిచూసి వికెట్లను గిరాటేయగలడు. అలాంటి ఒక ఘటన ఇది. ప్లేయర్ బాల్‌ని హిట్ చేసి రన్‌కు పరుగెడుతుండగా.. బాల్ అందుకున్న కోహ్లీ నాన్ స్ట్రైకర్ ఎండ్‌కి బాల్‌ని త్రో చేశాడు. అది బ్యాట్‌కు తగిలేలా ఉందని.. క్రీజులో పెట్టాల్సిన బ్యాట్‌ని పైకి లేపాడు. ఇంకేముంది బెయిల్స్ ఎగిరిపడి.. పెవిలియన్ చేరాడు.
ఆస్ట్రేలియా ఉమెన్- టీమిండియా ఉమెన్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు కీపర్ చేసిన ఒక పొరపాటు రావాల్సిన వికెట్‌ని రాకుండా చేసింది. బాల్‌ని హిట్ చేసేందుకు బ్యాటర్ స్టెపౌట్ అవ్వగా.. బంతిని కీపర్ హేలీ అందుకుంది. కానీ, ఆ కంగారులో ఎడమ చేతిలో బంతిని పెట్టుకుని.. కుడి చేత్తో వికెట్లను గిరాటేస్తుంది. తర్వాత తప్పు తెలుసుకుని అవుట్ కాలేదు అంటూ సైగ చేస్తూ వెళ్లిపోయింది.
అఫ్గనిస్థాన్- జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్లే కాదు.. అంపైర్లు, కామెంటేటర్లు కూడా ఆశ్చర్యపోయారు. అఫ్గాన్ ప్లేయర్ ఉస్మాన్ బాల్ ని డిఫెండ్ చేసి రన్ కోసం పరుగెత్తుతాడు. కానీ, అక్కడ రనౌట్ అయ్యే ఛాన్స్ ఉందని సగం పిచ్ దాకా వెళ్లి వెనక్కి వస్తాడు. అయితే జింబాబ్వే ప్లేయర్ హామిల్టన్ బాల్ ని అందుకుని కీపర్‌కు త్రో చేయకుండా.. పరిగెత్తుకుంటూ వచ్చి స్టంప్స్‌ని హిట్ చేస్తాడు. అప్పటికే ఉస్మాన్ క్రీజులోకి వచ్చేస్తాడు. అయితే హామిల్టన్ ఎందుకు త్రో చేయలేదని అంతా బుర్రలు గోక్కున్నారు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమముల్ హక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ని ఆడాడు. అలాగే కెరీర్లో చాలాసార్లు సిల్లీగా అవుట్ కూడా అయ్యాడు. అలా ఓసారి బౌలర్ వేసిన బంతిని ఆడకుండా ముందుకు జరిగి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే నిజానికి అది చాలా మంచి బాల్.. కానీ ఇంజమముల్ దానిని వదిలేసి ఔట్ అయ్యాడు.