ఐపీఎల్‌లో సెకండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ధోని కెప్టెన్సీలోని సీఎస్‌కే ఇప్పటికే నాలుగు సార్లు ఐపీఎల్ కప్పు కొట్టింది. ఈ సారి దాన్ని ఐదుకు పెంచాలని భావిస్తోంది. కానీ.. సీజన్ ఆరంభానికి ముందే సీఎస్‌కే కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
క్రికెట్ అభిమానులకు నాన్‌స్టాప్ వినోదం అందించే ఐపీఎల్ మరికొన్ని రోజుల్లోనే ఆరంభం కానుంది. ఈ సీజన్‌కు ఎప్పటిలాగే క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే అన్ని టీమ్స్ కూడా ఐపీఎల్ 2023 కోసం పూర్తి స్థాయిలో రెడీ అయిపోయాయి. దాదాపు ఆటగాళ్లంతా తమ తమ జట్లతో చేరిపోయారు. ఇక ఈ నెల 31న అహ్మాదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మధ్య తొలి మ్యాచ్‌తో ఈ సీజన్ సమరం ఆరంభం కానుంది. అయితే.. తొలి మ్యాచ్‌కు ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2021లో ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై.. ఐదో సారి కప్పు కొట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపనుంది.
ఎన్నో ఆశలు పెట్టుకుని చెన్నై.. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను ఐపీఎల్ 2023 మినీ వేలంలో కొనుగోలు చేసింది. స్టోక్స్ రాకతో చెన్నై జట్టు మరింత బలపడుతుందని అంతా భావించారు. ఎందుకంటే అతను టీ20 వరల్డ్ కప్‌లో చూపించిన ప్రదర్శన అలాంటిది. బ్యాటింగ్, బౌలింగ్‌లో స్టోక్స్ చెన్నైకి అదనపు బలంగా మారతాడని భావించారు. దీంతో సీఎస్‌కే ఐదో ట్రోఫీపై భారీ ఆశలే పెట్టుకుంది. ఆ జట్టు ఆటగాడు మహేంద్రసింగ్ ధోనికి ఇది చివరి ఐపీఎల్‌గా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. కప్పు గెలిచి ధోనికి ఘనంగా వీడ్కోలు పలకొచ్చని సైతం సీఎస్‌కే భావించింది. అందుకు బెన్ స్టోక్స్ చాలా ఉపయోగ పడతాడని అనుకుంది.
కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. ఐపీఎల్ 2023లో బెన్ స్టోక్స్ కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ వెల్లడించాడు. బెన్ స్టోక్స్ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడని, టోర్నీ మధ్యలో అతను బౌలింగ్ చేయాలని కోరుకుంటున్నట్లు హస్సీ వెల్లడించాడు. దీంతో.. ఈ సీజన్‌లో స్టోక్స్ కేవలం ఒక్క పక్కా బ్యాటర్ రోల్‌లో మాత్రమే బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. స్టోక్స్ కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం అయితే.. బౌలింగ్ విభాగం వీక్ అయ్యే అవకాశం ఉంది. ఇది సీఎస్‌కే విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
As per reports, Ben Stokes will start as a specialist batter in IPL 2023. He’s managing a knee injury and is not fit to bowl.
📸: CSK/Twitter#CricTracker #IPL2023 #BenStokes pic.twitter.com/qIuwejz9We
— CricTracker (@Cricketracker) March 28, 2023