కెరీర్ ఆరంభంలో స్వింగ్ కింగ్‌గా పేరుతెచ్చుకున్న భువనేశ్వర్ కుమార్ గత కొంతకాలంగా ఆ ప్రభావం చూపలేకపోయాడు. పైగా ఆసియా కప్ సూపర్ ఫోర్‌లో పాకిస్థాన్, శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌ల్లో 19వ ఓవర్‌లో ధారళంగా పరుగులు సమర్పించుకుని ఓటమికి కారకుడైయ్యాడు. దీంతో భువీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ.. గురువారం అఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ తన స్వింగ్ పవర్‌ను చూపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో చెలరేగినట్లు స్వింగ్‌తో ఆఫ్ఘాన్ బౌలర్లను వణించాడు. 4 ఓవర్ల స్పెల్‌ను కంటిన్యూగా వేసిన భువీ.. ఏకంగా 20 డాట్ బాల్స్ వేశాడు. 5 వికెట్లు సాధించాడు. నిజానికి ఇది ఒక డ్రీమ్ స్పెల్. భువీనే కాదు, మరే బౌలర్ అయినా సరే కలలో కూడా ఊహించని స్పెల్ ఇది.
4 ఓవర్లు వేసి భువీ కేవలం 4 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. కాగా.. టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన యుజ్వేంద్ర చాహల్(83 వికెట్లు) రికార్డును భువీ బద్దలు కొట్టాడు. 84 వికెట్లతో టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇక నామమాత్రపు ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవడంతో కేఎల్ రాహుల్‌తో పాటు విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వచ్చాడు. ఇద్దరూ చెలరేగి ఆడటంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. కేఎల్ రాహుల్ 41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 62 పరుగులు చేసి ఫరీద్ అహ్మాద్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. గాయం తర్వాత జట్టులోకి వచ్చిన రాహుల్ ఈ మ్యాచ్‌తో టచ్‌లోకి వచ్చాడు. ఇకా కింగ్ కోహ్లీ అయితే ఈ మ్యాచ్‌లో వీర విహారం చేశాడు. 61 బంతుల్లోనే 12 ఫోర్లు, 6 సిక్సులతో 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి దుమ్మురేపాడు.
చాలా కాలంగా వేధిస్తున్న సెంచరీని ఒక రేంజ్‌లో సాధించాడు. సూర్యకుమార్ యాదవ్(6), రిషభ్ పంత్ 20 రన్స్ చేసి నాటౌట్‌గా నిలవడంతో… టీమిండియా 20 ఓవర్లలో 212 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘాన్ బౌలర్లలో ఫరీద్ రెండు వికెట్లు తీసుకున్నాడు. భారీ లక్ష్యఛేదనలో ఆఫ్టాన్ తేలిపోయింది. భువీ దెబ్బకు ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. 21 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘాన్ ఇబ్రహీం జద్రాన్ 59 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 64 పరుగులు చేసి ఆఫ్ఘాన్‌కు ఘోర ఓటమిని తప్పించాడు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘాన్ 111 పరుగులు చేసి 101 పరుగుల తేడా ఓటమిని చవిచూసింది. విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో భువీ స్పెల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: కింగ్ కోహ్లీ సెంచరీ చేస్తే రికార్డుల వర్షమే! 1 కాదు, 2 కాదు.. ఏకంగా 12 రికార్డులు
#BhuvneshwarKumar becomes the highest wicket taker for #TeamIndia in T20Is 🙌#AsiaCup2022 | #INDvAFG | #AsiaCupT20 pic.twitter.com/CZWgicZgsN
— Doordarshan Sports (@ddsportschannel) September 8, 2022
king of swing#bhuvneshwarkumar #Bhuvi #IndianCricketTeam pic.twitter.com/4QgjaKHtnY
— Rohit Solanki 🇮🇳 (@Im_the_one_45) September 8, 2022