టీ20 ప్రస్థానం మొదలయ్యాక క్రికెట్ అంటేనే బ్యాట్టింగ్ ఫ్రెండ్లీ అయిపోయింది. ఈ పొట్టి ఫార్మాట్ లో ఉన్న రూల్స్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండడంతో.. ఎంతటి బౌలరైనా ఎలా బంతులు వేయాలా అని వ్యూహాలు రచిస్తూ ఉంటాడు. మలింగా యార్కర్లతో.. ఆర్చర్ బౌన్సర్లతో..బుమ్రా యాంగిల్ తో..ఇలా ఒక్కొక్క బౌలర్ ఒక్కొక్క విధంగా.. వైవిధ్యంగా బంతులేస్తూ బ్యాటర్లను ఇబ్బందిపెట్టడానికి చూస్తుంటారు. ఏది ఏమైనా ధనా ధన్ ఇన్నింగ్స్ లో బ్యాటర్లది కొంచెం పైచేయిగా ఉంటది. అయితే.. ఈ పొట్టి ఫార్మాట్ లో ఇన్నింగ్స్ మొదలైన తొలి బంతికే వికెట్ తీయడం గొప్ప అనుభూతిగా చెప్పవచ్చు.
లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీమిండియా నిర్ధేశించిన 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది. అయితే.. ఈ మ్యాచులో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. భారత్ నిర్ధేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి శ్రీలంక బ్యాటర్లు ప్రతుమ్ నిస్సంక, కమిల్ మిశారా క్రీజులోకి వచ్చారు. మొదటి ఓవర్ వేయడానికి మన స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ బంతి తీసుకున్నాడు . ఇంకేముంది..తొలి బంతికే ప్రతుమ్ నిస్సంకాని బౌల్డ్ చేశాడు. టీమిండియా క్రికెట్ ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఎంతో మంది దిగ్గజ బౌలర్లు ఉన్నప్పటికీ ఈ రికార్డు ఎవరకి సాధ్యం కాలేదు. భువీ మాత్రం దాన్ని చేసి చూపించాడు.తద్వారా టీమిండియా తరపున టీ20ల్లో తొలి బంతికే వికెట్ తీసిన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. ఈ ఘటనతో భువనేశ్వర్ కుమార్ వన్డే కెరీర్‌లో మొదటి బంతికే వికెట్ తీసిన విషయం గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. డిసెంబర్ 30, 2012 చెన్నైలోని చిదంబరం వేదికగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచులో భువనేశ్వర్.. పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ హఫీజ్‌ను తన తొలి బంతికే ఇన్-స్వింగర్‌తో అవుట్ చేశాడు, తద్వారా వన్డేల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకున్నా విషయం తెలిసిందే.
Nissanka’s bowled wicket🔥
Bhuvi removed Nissanka on his very 1st ball& gave an excellent start to team by taking 2 wkts in his 2 overs😍👏2-0-9-2 absolutely outstanding spells @BhuviOfficial
There is no replacement of Swing King in #TeamIndia#INDvsSL #INDvSL #bhuvneshwarkumar pic.twitter.com/2ulAUXg9p2— Ravina Sharma (@Ravina4515) February 25, 2022
Happy ODI debut day my champ.on this day in 2012 Swing king Bhuvneshwar Kumar made his ODI debut against Pakistan.@BhuviOfficial bowled out M Hafeez with an in-swinger off on his 1st ball of the 1st over in ODI on debut.he was exceptional with bowling figures of 9-3-27-2 #Bhuvi pic.twitter.com/RT4XrscdYO
— Ravina Sharma (@Ravina4515) December 30, 2020