భువనేశ్వర్ కుమార్ అలియాస్ స్వింగ్ కింగ్.. మళ్లీ తన స్వింగ్‌ను అందిపుచ్చుకున్నాడు. కెరీర్ లో కాస్త ఇబ్బంది పడిన భువనేశ్వర్ తిరిగి పుంజుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పిచ్ మీదైనా బాల్ ని స్వింగ్ చేయగలగడం అతని గొప్పతనం. క్రికెట్ హిస్టరీలో ఎంతో మంది హేమాహేమీలను పెవిలియన్ చేర్చిన ఘనత భువనేశ్వర్ సొంతం.
ఈ స్వింగ్ కింగ్ ఖాతాలో ఇప్పటికే ఎన్నో అవార్డులు, రికార్డులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ టీ20ల్లో పవర్ ప్లే ఓవర్లలో 502 డాట్ బాల్స్ వేసిన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లో భువనేశ్వర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. అతని పదేళ్ల కెరీర్లో ఐదోసారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. గతంలో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ మూడేసి సార్లు మాత్రమే ఈ ఘతన సాధించారు.
తాజాగా భువనేశ్వర్ కుమార్ మరో అరుదైన ఘనత సాధించాడు. అదేంటంటే… టీ20ల్లో టీమిండియా తరఫున తొలి ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా భువనేశ్వర్ కుమార్ రికార్డు సృష్టించాడు. తన కెరీర్లో తొలి ఓవర్లలో మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు. భువీ ఉన్న స్వింగ్ చూస్తుంటే ఇలాంటి రికార్డులు మరెన్నో అవలీలగా బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాడు.
అంతేకాకుండా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడిన భువీ మొత్తం 17 వికెట్లు తీశాడు. టీ20 ప్రపంచకప్ సమరంలోపు టీమిండియా దాదాపు 15 టీ20 మ్యాచ్ లు ఆడే అవకాశం ఉంది. వాటన్నింటిలో భువనేశ్వర్ పాల్గొంటే ఏడాదిలో టాప్ వికెట్స్ తీసిన బౌలర్ గా భువనేశ్వర్ కుమార్ కచ్చితంగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. భువనేశ్వర్ సాధించిన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
What A Unplayable Delivery By Bhuvaneshwar Kumar 🤩pic.twitter.com/eeJIXI5eN9
— Oh My Cricket (@OhMyCric) July 7, 2022