టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన కెరీర్లో మరో అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా క్రికెట్ చరిత్రలో మరే పేసర్ ఈ ఘనత సాధించలేదు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ20 సరీస్ లో భువనేశ్వర్ కమార్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ అవార్డుతో మొత్తం తన 10 ఏళ్ల కెరీర్లో భువనేశ్వర్ 4సార్లు ఈ ఘనత సాధించాడు. గతంలో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ మూడేసి సార్లు చొప్పున ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు భారత క్రికెట్ చరిత్రలో భువనేశ్వర్ నాలుగుసార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న తొలి పేసర్ గా రికార్డు సృష్టించాడు.
సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్ లో భువనేశ్వర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొత్తం నాలుగు మ్యాచుల్లో 6.05 ఎకానమీతో 6 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ సిరీస్ లో హర్షల్ పటేల్ 7 వికెట్లు పడగొట్టినప్పటికీ.. భువీ పవర్ ప్లేలో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సక్సెస్ అవ్వడంతో భువనేశ్వర్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా భువనేశ్వర్ ప్రదర్శనపై దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ మార్క్ బౌచర్ ప్రశంసల వర్షం కురిపించారు.
Bhuvaneshwar Kumar is named the Player of the Series for his fine display with the ball 🇮🇳🔥#bhuvneshwarkumar #india #teamindia #southafrica #indvsa #cricket #CricketTwitter pic.twitter.com/hYF3PjX8S8
— 𝗙𝗮𝗻𝘁𝗮𝘀𝘆 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗟𝗲𝗮𝗴𝘂𝗲 (@playfcl_) June 20, 2022
‘తొలి రెండు టీ20ల్లో మా జట్టు గెలిచి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టింది. అలాంటి దశ నుంచి సిరీస్ 2-2తో సమం అయ్యింది అంటే అది భువనేశ్వర్ స్పెషల్ స్పెల్ వల్ల మాత్రమే సాధ్యం అయ్యింది. 4మ్యాచుల్లో భువన్వేర్ 14 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 85 పరుగులే ఇచ్చాడు. 6.07 ఎకానమీతో 6 వికెట్లను తీశాడు. టీ20 ఫార్మాట్‌లో ఇది కచ్చితంగా ఉత్తమ ప్రదర్శనే అవుతుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకోవడానికి భువనేశ్వర్ కుమార్ నూటికి నూరు శాతం అర్హుడు’ అంటూ దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ మార్క్ బౌచర్ వ్యాఖ్యానించాడు. భువనేశ్వర్ కుమార్ సాధించిన ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
For his impressive bowling performance against South Africa, @BhuviOfficial bags the Payer of the Series award. 👏👏#TeamIndia | #INDvSA | @Paytm pic.twitter.com/gcIuFS4J9y
— BCCI (@BCCI) June 19, 2022