కాళ్లలో ఏదో స్ప్రింగ్ ఉన్నట్లు.. చేయి పట్టి ఎవరో గట్టిగా లాగినట్లు.. గాల్లోకి పక్షిలా ఎగిరి.. అద్భుతమైన కాదు.. కాదు.. అత్యాద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు రంజీ ప్లేయర్. ఇలాంటి క్యాచ్ చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. వీడియోను కనీసం పదిసార్లయినా.. రివైండ్ చేసి చూడాలనిపించే క్యాచ్ అది. అసలు మనిషన్నవాడు ఎవడైనా ఇలాంటి క్యాచ్ అందుకుంటాడా అనే అనుమానం కలగక మానదు ఆ క్యాచ్ చూస్తే.. నిజంగానే మ్యాచ్‌లో ఆ క్యాచ్ అందుకున్నాడా.. లేక గ్రాఫిక్స్ ఏమైనా చేశారా? అనే అనుమానం కలుగుతుంది ఆ క్యాచ్ చూస్తుంటే.. ఈ అద్భుతమైన క్యాచ్ మంగళవారం రంజీ ట్రోఫీ 2022-23లో చోటు చేసుకుంది. బెంగాల్-ఉత్తరప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వికెట్ కీపర్ అబిషేక్ పొరెల్ ఈ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ మంగళవారం ప్రారంభమైంది. కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఉత్తరప్రదేశ్‌తో బెంగాల్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ టీమ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బెంగాల్ బౌలర్ ఇషాన్ పొరెల్ చెలరేగి ఉత్తరప్రదేశ్ ఓపెనర్లు మాధవ్ కౌశిక్, ఆంజనేయ సూర్యవంశీలను డకౌట్లుగా అవుట్ చేసి చావు దెబ్బ కొట్టాడు. దీంతో 0కే యూపీ రెండు వికెట్లు కోల్పోయింది. మరికొద్ది సేపటికే యూపీ కెప్టెన్ కరణ్ శర్మ సైతం 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో యూపీ 26 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఇలా బెంగాల్ బౌలర్ల ధాటికి యూవీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్న సమయంలో యూపీ ఆల్‌రౌండర్, ఐపీఎల్‌ల్లో కేకేఆర్‌కు ఆడుతూ మంచి ప్రదర్శన కనబరుస్తున్న శివమ్ మావీ క్రీజ్లోకి వచ్చాడు.
151 పరుగులకు 6 వికెట్లు పడిపోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మావీ.. 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద, బెంగాల్ బౌలర్ ప్రీతమ్ వేసిన ఇన్నింగ్స్ 54వ ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ కోసం ప్రయత్నించాడు. ప్రీతమ్ వేసిన షార్ట్ బౌన్సర్ మావీ బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకుని లెగ్‌సైడ్.. వికెట్ కీపర్‌కు చాలా దూరంగా వెళ్తోంది. ఆ బంతిని ఒక్కసారిగా ఆమాంతం గాల్లోకి దూకిన బెంగాల్ వికెట్ కీపర్ అభిషేక్ పొరెల్ అత్యాద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఆ క్యాచ్ చూసి బెంగాల్ ఆటగాళ్లతో పాటు యూవీ బ్యాటర్ శివమ్ మావీ సైతం ఆశ్చర్యపోయాడు. కాగా.. అబిషేక్ పొరెల్ పట్టిన ఆ క్యాచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రంజీల్లో జూనియర్ ధోని అంటూ క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. అయితే.. ధోని సైతం ఇలాంటి క్యాచ్ అందుకోలేదని మరికొంతమంది అభిమానులు అంటున్నారు. మరి కింద ఉన్న వీడియో చూసి.. అబిషేక్ పొరెల్ పట్టిన క్యాచ్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
— MINI BUS 2022 (@minibus2022) December 13, 2022