గాయం కారణంగా క్రికెట్‌కు దూరమైన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అదిరిపోయే రీతిలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడుతున్న బెన్ స్టోక్స్ తన విశ్వరూపం చూపించాడు. ఒకే ఓవర్ లో 34 పరుగులు కొట్టి 18 ఏళ్ల కుర్రాడిని బిత్తరపోయేలా చేశాడు. ఈ క్రమంలో 64 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్ లో డర్హమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టోక్స్ వోర్సెస్టర్‌షైర్‌పై ఈ ఫీట్ నమోదు చేశాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్లే అవకాశం తృటిలో కోల్పోయినప్పటికి ప్రత్యర్థి బౌలర్‌కు మాత్రం చుక్కలు చూపించాడు.
ఇన్నింగ్స్ 117వ ఓవర్‌కు ముందు బెన్ స్టోక్స్ స్కోర్.. 59 బంతుల్లో 70 పరుగులు. జోష్ బేకర్ వేసిన ఆ ఓవర్‌లో తొలి ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాదిన స్టోక్స్.. చివరి బంతిని బౌండరీ తరలించి 34 పరుగులు రాబట్టడంతో పాటు 64 బంతుల్లో సెంచరీ మార్కును చేరుకున్నాడు. ఈ విధ్వంసం ఇక్కడితో ముగిసిపోలేదు. డర్హమ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి స్టోక్స్ 88 బంతుల్లో 8 ఫోర్లు, 17 సిక్సర్లతో 161 పరుగులు చేశాడు. బెన్ స్టోక్స్ 161 పరుగుల్లో.. 134 పరుగులు కేవలం సిక్సర్లు, ఫోర్ల ద్వారానే వచ్చాయంటే స్టోక్స్ విధ్వంసం ఏ రేంజ్‌లో సాగిందో అర్థమయి ఉండాలి. దీంతో ‘బెన్ స్టోక్స్ ఈజ్ బ్యాక్’ అంటూ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
In his first-ever match in the #CountyChampionship this season, @benstokes38 has smashed 34 runs in a single over 🔥
He gets to his 💯 in just 64 balls 😮
— ESPNcricinfo (@ESPNcricinfo) May 6, 2022
ఇది కూడా చదవండి: Michael Hussey: తెరమీదకు CSK స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం.. అసలు విషయం చెప్పిన మైక్ హస్సీ
కాగా, ఇటీవల బెన్ స్టోక్స్ ‘ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్’గా నియమితుడైన సంగతి తెలిసిందే. యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లాండ్ ఘోర పరాజయం కావడంతో పాటు, వెస్టిండీస్ చేతిలోనూ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో ఈ ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ టెస్ట్ కెప్టెన్సీకి జో రూట్ రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో రూట్ వారసుడిగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బెన్ స్టోక్స్‌ను నియమించింది. బెన్ స్టోక్స్ నాయకత్వంలో ఇంగ్లాండ్ జట్టు త్వరలోనే సొంతగడ్డపై న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లతో టెస్టుల్లో తలపడనుంది.
6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 4️⃣
What. An. Over.
34 from six balls for @benstokes38 as he reaches a 64 ball century 👏#LVCountyChamp pic.twitter.com/yqPod8Pchm
— LV= Insurance County Championship (@CountyChamp) May 6, 2022