ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఇటివల వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆదివారం టీమిండియా ముగిసిన మూడు వన్డేల సిరీస్ అనంతరం బెన్ స్టోక్స్ తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. మంగళవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌తో స్టోక్స్ తన చివరి వన్డే ఆడేశాడు. ఈ మ్యాచ్ సందర్భంగా బెన్‌స్టోక్స్ కొంత భావోద్వేగానికి గురయ్యాడు.
దాదాపు 11 ఏళ్ల పాటు వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లండ్ జట్టు సేవలందించిన స్టోక్స్ చివరి వన్డే నేపథ్యంలో చాలా గంభీరంగా కనిపించాడు. ఇంగ్లండ్ జట్టు కూడా ఫీల్డింగ్‌కు వచ్చే సమయంలో కెప్టెన్ జోస్ బట్లర్ స్థానంలో బెన్‌స్టోక్స్‌ను ముందు పంపించి గౌరవించింది. ఈ సమయంలో స్టోక్స్ కళ్లవెంట నీళ్లు తెంచుకుని తలదించుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చేదు అనుభవం..
బెన్‌స్టోక్స్‌కు తన చివరి వన్డే ఒక చేదు అనుభవంలా మిగిలిపోనుంది. విజయంతో వన్డేలకు వీడ్కోలు పలకాలనుకున్న స్టోక్స్ ఆశలపై సౌతాఫ్రికా నీళ్లు చల్లింది. స్టోక్స్ ఆడుతున్న చివరి వన్డేలో ఇంగ్లండ్ ఓటమి పొందడం స్టోక్స్‌కు మరింత బాధను మిగిల్చిందని చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి మార్కరమ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అని అభిమానులను నిరాశ పరిచాడు.
కాగా ఈ మ్యాచ్‌లో తొలుగ బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా డసెన్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 333 పరుగుల భారీ చేసింది. బదులుగా ఇంగ్లండ్ 46.5 ఓవర్లకు 271 పరుగులు చేసి ఆలౌట్ అయి ఓటమి చవిచూసింది. ఇలా బెన్‌స్టోక్స్ చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ దారుణంగా ఓటమి పాలైంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
An emotional moment for @benstokes38 😪#ThankYou #BenStokes pic.twitter.com/Fz5pL9QrYk
— CricTracker (@Cricketracker) July 19, 2022
Not the ending Ben Stokes would have wanted in ODIs but he certainly gave 💯% as always! 🙌👏🙏#ENGvSA | #SAvENG | pic.twitter.com/tXIEJwlhIn
— 🏏Flashscore Cricket Commentators (@FlashCric) July 19, 2022
One of the greatest player to play this format, you will be missed Ben Stokes. pic.twitter.com/yJC2hA9gsu
— Ramiya 2.0 (@yehtuhogaaa) July 19, 2022
Ben Stokes leads England onto the field in his final ODI 🙌https://t.co/D9IkMLwhaR | #ENGvSA pic.twitter.com/ABnf4tQBFA
— ESPNcricinfo (@ESPNcricinfo) July 19, 2022