ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇదికాస్త ఫ్యాన్స్ మధ్య డిస్కషన్ కు కారణమైంది.
ఇంగ్లాండ్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డ్ సాధించాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ ఘనత నమోదు చేశాడు. ఇంగ్లాండ్ టీమ్ గురించి చెప్పుకుంటే ఓ ఆరేడేళ్ల ముందు వరకు చాలా నిదానంగా ఆడేది. ఎప్పుడైతే తమ గేమ్ లో వేగం పెంచారో.. మొత్తం సీనే మారిపోయింది. టీ20ల్లో ఎలా అయితే ఆడతారో.. వన్డే, టెస్టుల్లోనూ ఇంగ్లాండ్ అలానే ఆడుతూ ప్రత్యర్థి జట్లను భయపెడుతోంది. అంతెందుకు ఈ టెస్టునే తీసుకుంటే.. తొలి ఇన్నింగ్స్ లో 58.2 ఓవర్లలో 325-9 పరుగులు చేసింది. అదే స్కోరు దగ్గర డిక్లేర్ చేసింది. ఈ పరుగులన్నీ కూడా టెస్టు ప్రారంభమైన తొలిరోజే చేయడం విశేషం. రెండో ఇన్నింగ్స్ లో అలానే ఆడుతోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఐదు రోజుల టెస్టు క్రికెట్ అంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఫార్మాట్. టీ20లు వచ్చిన తర్వాత దీనికి ఆదరణ కాస్త తగ్గినట్లు అనిపించింది. కానీ రీసెంట్ టైంలో టెస్టుల్లో కూడా వేగం పెరిగింది. స్టార్ బ్యాటర్ల దగ్గర నుంచి టెయింలెండర్ల వరకు ప్రతి ఒక్కరూ రెచ్చిపోయి మరీ బ్యాటింగ్ చేస్తున్నారు. అలా స్టోక్స్ కూడా తాజాగా ఓవల్ లో జరుగుతున్న ఈ టెస్టులో ఓ మాదిరిగా ఆడాడు. కానీ సిక్సుల విషయంలో మాత్రం సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. టెస్టుల్లో ప్రస్తుతం మెకకల్లమ్ పేరిట ఉన్న అత్యధిక సిక్సులు(107) ఫీట్ ని స్టోక్స్ అధిగమించాడు. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో వైరల్ గా మారింది.
మెకకల్లమ్, 101 మ్యాచుల్లో 107 సిక్సులు కొడితే.. స్టోక్స్ మాత్రం 90 మ్యాచుల్లో 108 సిక్సులు కొట్టి ఈ జాబితాలో టాప్ ప్లేసులోకి వెళ్లిపోయాడు. ఇక తర్వాతి స్థానాల్లో గేల్ (100), ఆడమ్ గిల్ క్రిస్ట్ (98), జాక్వెస్ కల్లీస్ (97) వరసగా ఉన్నాడు. ఇదిలా ఉండగా న్యూజిలాండ్ కెప్టెన్, వికెట్ కీపర్, బ్యాటర్ గా ఆటలో వేగం తీసుకొచ్చిన మెకకల్లమ్.. ప్రస్తుతం ఇంగ్లాండ్ కోచ్ గా ఉన్నాడు. అతడి వచ్చిన తర్వాత 10 టెస్టుల్లో 9 మ్యాచుల్లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించడం విశేషం. ప్రస్తుతం టెస్టు ఛాంపియన్ షిప్ టేబుల్లో 124 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మరి స్టోక్స్.. టెస్టుల్లో చరిత్ర సృష్టించడంపై మీరేం అంటారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
Ben Stokes goes clear of Brendon McCullum as the leading six-hitter in Test history! 💥 #NZvENG pic.twitter.com/UVKVOVKywc
— ESPNcricinfo (@ESPNcricinfo) February 18, 2023