ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనతను సాధించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడి చరిత్ర సృష్టించాడు. 114 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు. తద్వారా టెస్టు కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 120 పరుగులు సాధించిన స్టోక్స్.. టెస్టుల్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సిక్సర్ బాది ఈ ఫీట్ నమోదు చేయడం విశేషం.
ఈ క్రమంలో బెన్ స్టోక్స్ తన పేరిట ఓ రికార్డు లిఖించుకున్నాడు. టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటుగా 150కి పైగా వికెట్లు పడగొట్టిన ఐదో ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు. క్రికెట్ దిగ్గజాలు సర్ గ్యారీ సోబర్స్, సర్ ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, జాక్వెస్ కలిస్ తర్వాతి స్థానంలో నిలిచాడు. కాగా స్టోక్స్ ఐపీఎల్ 2022 సీజన్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మరి బెన్ సాధించిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: యాషెస్‌లో తీవ్ర దుమారం.. మిషన్ పగిలిపోవడంతో నష్టపోయిన ఆసీస్
Ben Stokes completing 5,000 Test runs landmark in style.
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.