టెస్ట్ క్రికెట్‌కే వన్నెతెచ్చే యాషస్ సిరీస్ మొదలైపోయింది. తీవ్ర భావోద్వేగాలతో కూడిన ఈ సిరీస్‌లో ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనలు, గరం గరం ఘటనలతో పాటు కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్లు కూడా చోటు చేసుకుంటాయి. యాషస్ సిరీస్‌లో భాగంగా బ్రిస్బెన్‌లో జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజు ఆటలో జరిగిన ఘటన ఆసక్తికరంగా మారింది. మొదటి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అవ్వగా.. బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాలకు మొదటిలోనే దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు బెన్ స్టోక్స్. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 17 పరుగుల వద్ద ఉన్న సమయంలో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఒక్కసారిగా స్టేడియం మూగబోయింది.
ఆసీస్ ఆటగాళ్లు షాక్ అయ్యారు.. కానీ దాన్ని నోబాల్ ప్రకటించడంతో వార్నర్ ఊపిరిపీల్చుకున్నాడు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే స్టోక్స్ తన ఓవర్ నాలుగో బంతికి వార్నర్‌ను బౌల్డ్ చేశాడు. దాన్ని అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. కానీ అంతకు ముందు స్టోక్స్ వేసిన మూడు బాల్స్ కూడా నో బాల్స్ కావడం విశేషం. కానీ అంపైర్ వాటిని గుర్తించలేదు. కానీ వికెట్ లభించిన బంతి నో బాల్ అని గమనించి ఇంగ్లండ్ సంబరాలను నీరుగార్చాడు. అంతకుముందు మూడు నోబాల్స్ ఇవ్వనందుకు ఆస్ట్రేలియా ఏమాత్రం ఫీల్ అవ్వడం లేదు. ఎందుకంటే కరెక్ట్ టైమ్‌కి అంపైర్ నిద్రలేచాడులే అని నవ్వుకుంటున్నారు. మరి ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Each of Ben Stokes’ first four deliveries to David Warner was a no-ball 👀@copes9 | #Ashes pic.twitter.com/kcyNrYHSYr
— 7Cricket (@7Cricket) December 9, 2021