ఆర్నే ఎస్పీల్.. బ్రెజిల్ కు చెందిన సెకండ్ ప్రొవిజినల్ డివిజన్ వెస్ట్ బ్రాబంట్ లో వింకిల్ స్పోర్ట్ బి టీమ్ కు గోల్ కీపర్ గా సేవలు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా వింకిల్ స్పోర్ట్ జట్టుకు వెస్ట్రోజెబ్కే టీమ్ కు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో..
సాధారణంగా మైదానాల్లో ఆటగాళ్లు గాయాలపాలవడం మనం చూస్తూనే ఉంటాం. ఇక ఆ గాయాం పెద్దదైతే కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవ్సాలి వస్తుంది. అయితే క్రీడా ప్రపంచంలో ఆటగాళ్లు మైదానాల్లో ప్రాణాలు విడిచిన సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. తాజాగా ప్రపంచ క్రీడాలోకంలో విషాదం నెలకొంది. మ్యాచ్ ఆడుతుండగానే ఓ ఆటగాడు తన ప్రాణాలను గ్రౌండ్ లోనే వదిలాడు. అతడిని ఆస్పత్రికి తరలించేటప్పటికే హార్ట్ ఎటాక్ తో కన్నుమూశాడు ఆ ప్లేయర్. ఈ ఘటన బెల్జియంలో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ లో చోటుచేసుకుంది.
ఆర్నే ఎస్పీల్.. బ్రెజిల్ కు చెందిన సెకండ్ ప్రొవిజినల్ డివిజన్ వెస్ట్ బ్రాబంట్ లో వింకిల్ స్పోర్ట్ బి టీమ్ కు గోల్ కీపర్ గా సేవలు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా వింకిల్ స్పోర్ట్ జట్టుకు వెస్ట్రోజెబ్కే టీమ్ కు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో వింకిల్ స్పోర్ట్ జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇక మ్యాచ్ మరికాసేట్లో ముగుస్తుంది అనగా.. ప్రత్యర్థి జట్టుకు పెనాల్టీ కిక్ లభించింది. ప్రత్యర్థి జట్టు ఆటగాడు కొట్టిన కిక్ ను సమర్థవంతగా అడ్డుకున్నాడు అర్నే ఎస్పీల్. ఈ క్రమంలోనే గుండెపోటుకు గురైయ్యాడు. పెనాల్టీ కిక్ ను అడ్డుకున్న మరుక్షణమే కుప్పకూలాడు అతడు. దాంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ గుండెపోటుతో అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. దాంతో వింకిల్ స్పోర్ట్ క్లబ్ లో విషాదం నెలకొంది.