ఐపీఎల్ 2022కు ముందు చెత్తఫామ్‌తో జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత గోడకు కొట్టిన బంతిలా డబుల్ స్పీడ్‌తో దూసుకొచ్చాడు. ఐపీఎల్‌లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా టైటిల్ అందించడంతో పాటు.. బ్యాట్, బాల్‌తో అద్భుతంగా రాణించాడు. దీంతో టీమిండియాలోకి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. పైగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. తాజాగా టీ20 జట్టుకు పర్మినెంట్ వైస్ కెప్టెన్ బాధ్యతలు కూడా హార్దిక్ పాండ్యాకే దక్కనున్నట్లు సమాచారం.
వన్డే, టీ20ల్లో టీమిండియా పర్మినెంట్ వైస్‌కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఉన్న విషయం తెలిసిందే. కానీ అతను వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఒక్క మ్యాచ్ సరిగ్గా ఆడలేదు. అయితే ఫిట్‌నెస్ సమస్య.. లేదంటే తరచూ గాయాల బారిన పడడం ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇక రోహిత్ శర్మ కూడా టీమిండియాకు అన్ని ఫార్మాట్లకు రెగ్యులర్ కెప్టెన్ అయినప్పటి నుంచి అతను కూడా ఫిట్‌నెస్, గాయాలు ఇలా ఏదో ఒక కారణంతో అప్పుడప్పుడు దూరమవుతూనే వస్తున్నాడు. కనీసం రోహిత్ ఏదో ఒక సిరీస్ ఆడుతున్నప్పటికి.. రాహుల్ మాత్రం ఒక్క సిరీస్ ఆడకుండానే దూరమవుతూ వస్తున్నాడు.
ఇక రోహిత్ లేని సమయాల్లో వైస్ కెప్టెన్ జట్టును నడిపించాల్సి ఉంటుంది. ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తాడని రాహుల్‌ను ఎంపిక చేస్తే అతనేమో తరచూ గాయాలపాలవుతూ జట్టులోనే ఉండటం లేదు. ఇలాగే కొనసాగితే టీమిండియాకు నష్టమని బీసీసీఐ భావిస్తోంది. దీంతో రానున్న టీ20 వరల్డ్ కప్‌కు రోహిత్ శర్మకు డిప్యూటీగా ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. అంతకముందే ఆసియాకప్ 2022కు కూడా పాండ్యాను వైస్‌కెప్టెన్‌గా ఎంపిక చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#HardikPandya likely to pip #KLRahul as India’s permanent vice captain in #T20I format: Reportshttps://t.co/idZDbHx1tt
— DNA (@dna) August 4, 2022