అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీన జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీని నిర్వహించేందుకు ఇప్పటికే 12 స్టేడియాలను షార్ట్ లిస్ట్ చేసింది BCCI. అందులో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (ఉప్పల్) స్టేడియం కూడా చోటు దక్కించుకుంది.
అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీన జరగబోతున్న విషయం తెలిసిందే. ఇక పుష్కర కాలం తర్వాత భారత్ వేదికగా వరల్డ్ కప్ జరుగుతుండటంతో.. ఈ మెగాటోర్నీని బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక ఈ టోర్నీని నిర్వహించేందుకు ఇప్పటికే 12 స్టేడియాలను కూడా షార్ట్ లిస్ట్ చేసింది. అందులో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (ఉప్పల్) స్టేడియం కూడా చోటు దక్కించుకుంది. అయితే వరల్డ్ కప్ నిర్వహణకు ముస్తాబు అవుతున్న స్టేడియాల్లో కనీస సౌకర్యాలు లేవని అభిమానుల నుంచి ఫిర్యాదులు రావడంతో.. బీసీసీఐ మంగళవారం కీలక నిర్ణం తీసుకుంది.
ఇండియా వేదికగా అక్టోబర్-నవంబర్ నెలల్లో వన్డే వరల్డ్ కప్ 2023 మెగాటోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో.. దేశంలోని స్టేడియాల లుక్ ను పూర్తిగా మర్చడానికి పూనుకుంది బీసీసీఐ. దీని కోసం రూ. 500 కోట్ల ఖర్చుతో స్టేడియాను రెనోవేట్ చేయనుంది. దీని కోసం దేశంలోని ఐదు స్టేడియాల రూపు రేఖలు మార్చడానికి పూనుకుంది బీసీసీఐ. వాటిల్లో ఢిల్లీ, హైదరాబాద్, కోల్ కతా, మెుహాలి, ముంబై స్టేడియాల్లో వసతులు మెరుగుపరచనున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి రూ. 117 కోట్లను కేటాయించింది బీసీసీఐ.
ఈ నిధులతో ఉప్పల్ స్టేడియంలో సీటింగ్ సౌకర్యంతో పాటుగా ఇతర వసతులను మెరుగుపరచనున్నారు. హైదరాబాద్ తో పాటుగా.. ఢిల్లీ స్టేడియానికి రూ. 100 కోట్లు, ఈడెన్ గార్డెన్స్ కు రూ. 127.47 కోట్లు, మెుహాలీ స్టేడియానికి రూ. 79.46 కోట్లు, ఇక ముంబైలోని వాఖండే స్టేడియానికి రూ. 78.82 కోట్ల రూపాయలను వసతుల కల్పన కోసం మంజూరు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డ్ గా ఉన్న బీసీసీఐ.. స్టేడియాల్లో వసతులు లేకపోతే పరువుపోతుంది. అందుకే ముందస్తు చర్యల్లో భాగంగా ఈ రెనోడేట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.