భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో 2-1 తేడాతో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. 50 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఓవల్ వేదికగా టీమిండియా సంచలన విజయం నమోదు చేసింది. అద్భుతమైన పోరాట పటిమ, సమిష్టి కృషితో టీమిండియా విజయ తీరాన్ని చేరుకుంది. ఈ విజయంలో కెప్టెన్‌గా కింగ్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందిన కోహ్లీకి బీసీసీఐ, గంగూలీ నుంచి మాత్రం అక్షింతలు తప్పలేదు. రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్‌లకు కరోనా నిర్ధరణ అయిన సంగతి తెలిసిందే. అసలు తలనొప్పి లండన్ హోటల్‌లో మొదలైంది.
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్తిర రచించిన ‘స్టార్ గేజింగ్’ అనే పుస్తకావిష్కరణకు విరాట్ కోహ్లీ సహా పలువురు టీమిండియా సభ్యులు కొందరు లండన్‌లోని ఓ హోటల్‌కు వెళ్లారు. సాధారణ సభ్యులు, అతిథులు హోటల్‌లో కార్యక్రమానికి హాజరయ్యారు. కోహ్లీకి నెగిటివ్ వచ్చినా.. రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌లు కరోనా పాజిటివ్ తేలారు. వారు కరోనా బారిన పడింది ఆ కార్యక్రమానికి వెళ్లడం వల్లే అని భావిస్తున్నారు. లండన్ హోటల్‌లో కార్యక్రమానికి వెళ్తున్నట్లు తమకు అధికారిక సమాచారం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.
బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించడాన్ని గంగూలీ కాస్త సీరియస్‌గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారిని పక్కనపెడితే కింగ్ కోహ్లీకి సౌమ్యంగానే కాస్త గట్టి క్లాస్ పీకినట్లు సమాచారం. కెప్టెన్‌గా నువ్వే నిబంధనలు ఉల్లంఘించడం ఏంటని గంగూలీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోసారి కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరైనా సరే.. కఠిన చర్యలు తప్పవని దాదా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. సెప్టెంబర్ 10 నుంచి మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆఖరి టెస్టు జరగనుంది. ఈ టెస్టుకు రవిశాస్త్రి సహా బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు దూరంగా ఉండనున్నారు.