కొన్ని రోజుల క్రితం టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి మనందరికి తెలిసిందే. ఆ ప్రమాదంలో పంత్ కారు మంటల్లో పూర్తిగా దగ్దం కాగా.. పంత్ గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతడి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇక పంత్ త్వరగా కోలుకోవాలని ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంకతో జరిగే తొలి టీ20కి ముందు BCCI ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. అందులో టీమిండియా ఆటగాళ్లు పంత్ తో తమ అనుబంధాన్ని పంచుకుంటూ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
కారు ప్రమాదంలో గాయపడిన పంత్ త్వరగా కోలుకోవాలని టీమిండియా క్రికెటర్లు ప్రార్థించారు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా ట్విట్టర్ లో షేర్ చేసింది. అందులో.. టీమిండియా కోచ్ ద్రవిడ్ తో పాటు, పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, చాహల్ తో పాటు మరికొంత మంది ఆటగాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముందుగా ద్రవిడ్ మాట్లాడుతూ..”పంత్ నిన్ను కొంత కాలంగా గమనిస్తునే ఉన్నాను. నువ్వు ఓ పోరాట యోధుడివి. నువ్వు ఆడిన కొన్ని ఇన్నింగ్స్ లు చరిత్రలోనే మిగిలిపోతాయి. నువ్వు త్వరగా కోలుకుని రావాలి, వస్తావు కూడా” అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక జీవితం అంటేనే అనుకోనివి జరగడం అని, ఇలాంటివి ప్రతీ ఒక్కరి జీవితంలో జరుగుతుంటాయి. కానీ నువ్వు వాటిని తట్టుకుని వస్తావని నాకు తెలుసు. పంత్ నువ్వు స్పీడ్ గా రికవరీ కావాలని కోరుకుంటున్నాను అని పాండ్యా చెప్పుకొచ్చాడు. ఇక మరికొంత మంది ఆటగాళ్లు అయిన సూర్యకుమార్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, ఇషాన్ కిషన్ లు కూడా పంత్ త్వరగా కోలుకోవాలని, జట్టులోకి తొందరగా రావాలని కోరుకున్నారు. ప్రస్తుతం బీసీసీఐ రిలీజ్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక పంత్ త్వరగా కోలుకుంటున్నాడని డాక్టర్లు పేర్కొన్నారు. పంత్ కు అండగా నిలబడుతూ.. వీడియో రిలీజ్ చేసిన బీసీసీఐపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
💬 💬 You are a fighter. Get well soon 🤗 #TeamIndia wish @RishabhPant17 a speedy recovery 👍 👍 pic.twitter.com/oVgp7TliUY
— BCCI (@BCCI) January 3, 2023