క్రికెట్ అభిమానులకు పండుగలాంటి వార్త.. క్రికెట్ ఆడేందుకు టీమిండియా పాకిస్థాన్ వెళ్లేందుకు బీసీసీఐ అంగీకరించింది. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఆసియా కప్ 2023లో పాల్గొనేందుకు భారత జట్టును పాకిస్థాన్ పంపేందుకు భారత క్రికెట్ బోర్డు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఇండియా-పాకిస్థాన్ అంటే పడిచచ్చే క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ దాయాదుల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేక కేవలం ఎప్పుడో ఒక సారి జరిగే ఐసీసీ ఈవెంట్స్‌లో చూసి ఆనందపడుతుంటారు. భారత్-పాక్ క్రికెట్‌కు మ్యాచ్ ఉన్న క్రేజ్ అలాంటిది కావడంతో టీమిండియా పాక్ వెళ్తుందనే విషయం సంచలనంగా మారింది. 2008తో భారత్ చివరి సారిగా పాకిస్థాన్‌లోని కరాచీలో మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత మళ్లీ పాక్‌కు వెళ్లలేదు.
కొన్ని కారణాల వల్ల భారత్-పాకిస్థాన్ మధ్య మంచి సంబంధాలు లేవు. దీంతో ఇరుదేశాల మధ్య దైపాక్షిక సిరీస్‌లను నిర్వహించవద్దని, భారత్‌లో పాక్ జట్టు పర్యటన చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాక్ జట్టు భారత్‌లో మ్యాచ్‌లు ఆడటం కానీ, టీమిండియా పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఆడటం కానీ జరగడం లేదు. అలాగే పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం కూడా లేకుండా పోయింది. కానీ.. ఆసియా కప్ 2023 కోసం బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో మళ్లీ దాయాదుల పోరును రెగ్యులర్‌గా చేసే అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా.. పాకిస్థాన్‌కు టీమిండియాను పంపేందుకు బీసీసీఐ సానుకూలంగా ఉన్నా.. భారత ప్రభుత్వం అనుమతిస్తేనే ఇది సాధ్యం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం తమ పాక్‌పై తన విధానాన్ని మార్చుకోకపోతే.. టీమిండియా పాక్ వెళ్లదు.
Will India travel to Pakistan to play the Asia Cup next year?
Going by a BCCI note circulated among the state associations, the possibility does exist. @vijaymirror has more ⏬ ⏬
— Cricbuzz (@cricbuzz) October 14, 2022
ఇది కూడా చదవండి: ధోనిని ద్వేషించే గంభీరే మీకు తెలుసు! కానీ.., దేశాన్ని ప్రేమించే గంభీర్ కథ మీకు తెలుసా? అతనో వారియర్!