‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’లో టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతైన విషయం తెలిసిందే. పొట్టి క్రికెట్ మెగా టోర్నీలో ట్రోఫీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్ పేలవ ప్రదర్శనతో ఇంటి ముఖం పట్టింది. ఆ విషయంలో వారిని విమర్శించే వారు, సమర్థిచేవారు లేకపోలేదు. కోహ్లీ కెప్టెన్‌గా ఎలాగైనా ఈ కప్పు కొట్టాలని గట్టిగా కోరుకున్నా కూడా వ్యతిరేక ఫలితమే వచ్చింది. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా అసహనం వ్యక్తం చేశారు. వరల్డ్ కప్ తర్వాత తాను టీ20 కెప్టెన్‌గా కొనసాగబోనని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎవరు ఆ పగ్గాలు చేపడతారు అనే చర్చ కూడా జోరుగానే జరుగుతోంది. ఆ అంశంపై మాజీలు సైతం తమ అభిప్రాయాలను బాహాటంగానే వెల్లిబుచ్చుతున్నారు. ఎవరు ఆ పగ్గాలు చేపడతారు అన్నదానిపై అధికారిక ప్రకటన తర్వాతే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు టీమిండియా దృష్టి అంతా భవిష్యత్ ప్రణాళికలపైనే ఉంది.
ఇదీ చదవండి: టీమిండియా టీ20 కెప్టెన్సీపై గౌతమ్ గంభీర్ ఆసక్తికర కామెంట్స్..
టీ20 కప్పు కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్‌కు చుక్కెదురైంది. ఎన్నో ప్రణాళికలు, వ్యూహాలతో ధోనీని మెంటర్‌గా ఉంచి ముందుకెళితే ఇలా జరిగిందే అంటూ అభిమానులు సైతం నిరాశకు గురయ్యారు. ఈసారి అలాంటి తప్పు జరగకూడదని గంగూలీ గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా రానున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్, టెస్టు ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే వరల్డ్ కప్ సాధించడమే లక్ష్యంగా సంసిద్ధం కావాలని ఇప్పటికే దాదా గంగూలీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
బీసీసీఐ నూతన హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎవరిని సెలక్ట్ చేయాలి, ఎలా ట్రైన్ చేయాలి అన్న విషయంలో ద్రావిడ్‌కు పూర్తి అధికారాలు కట్టబెట్టినట్లు చెబుతున్నారు. ఏదేమైనా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 సీన్ రిపీట్ కాకూడదని గట్టిగానే చెప్పినట్లు సమాచారం. ఎవరిని టీమ్ లో ఉంచాలి? ఏ టోర్నమెంట్ కు ఏ సీనియర్ ప్లేయర్ కు రెస్ట్ ఇవ్వాలి? అన్నదానిపై ద్రావిడ్‌దే ఫైనల్ కాల్‌గా చెబుతున్నారు. జట్టు ఎంపిక కూడా ఈసారి నుంచి వేరే లెవల్‌లో ఉండబోతోందని ఇన్ సైడ్ టాక్ కూడా వినిపిస్తోంది.