క్రికెట్ ప్రేమికులకు అమితానందాన్ని పంచే ధనాధన్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2022 మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. కరోనా కారణంగా గత రెండు సీజన్లు ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరిగాయి. దీంతో స్టేడియంలో లైవ్ మ్యాచ్ చూసేందుకు ఇష్టపడే వారు నిరాశపడ్డారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో.. భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌కు ప్రేక్షకులను అనుమతించిన విషయం తెలిసిందే.
మొహాలీలో తొలి టెస్టుకు 50 శాతం ఆక్యూపెన్సీతో ప్రేక్షకులను అనుమతించారు. కాగా శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు పూర్తి స్థాయి క్రౌడ్‌ను అనుమతించారు. బెంగుళూరులో జరిగే రెండో టెస్టుకు ప్రేక్షకులు పూర్తిస్థాయిలో రానున్నారు. ఈ టెస్టు సిరీస్ తర్వాత భారత్‌లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. దీంతో ఐపీఎల్‌కు కూడా ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉంది. గత రెండు సీజన్లలో ప్రేక్షకులు లేకుండా చప్పగా జరిగిన మ్యాచ్‌లకు.. టీవీలో చూసేవారి కోసం స్టేడియంలో ప్రేక్షకులు అరుస్తున్న ఫేక్ సౌండ్ వచ్చేలా చేశారు.
ఇప్పుడు ఐపీఎల్‌కు ప్రేక్షకులను అనుమతిస్తే.. క్రికెటర్ల చెవులు చిల్లులుపడేలా ప్రొత్సహిస్తూ క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. దీంతో టీవీల్లో ఫేక్ సౌండ్ కాకుండా.. రియల్‌గానే ప్రేక్షకుల ఆనందహేలను వినొచ్చు. మరి ఐపీఎల్ 2022 సీజన్‌కు ప్రేక్షకులను అనుమతిస్తే.. దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPL 2022: CSK నెట్ ప్రాక్టీస్ లో ధోని వీర బాదుడు! సింగిల్ హ్యాండ్‌తో సిక్స్!
🚨 NEWS 🚨: The Board of Control for Cricket in India (BCCI) announced the schedule for #TATAIPL 2022 which will be held in Mumbai and Pune.
A total number of 70 league matches and 4 Playoff games will be played in the duration of 65 days.
More Details 🔽
— IndianPremierLeague (@IPL) March 6, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.