అండర్ 19 క్రికెటర్ల కోసం బీసీసీఐ ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేస్తుంది. అండర్ 19 తర్వాత క్రికెటర్లు కనుమరుగు కాకుండా క్రికెట్‌లోనే కొనసాగేలా ఒక ప్లాన్‌ను అమలు చేయాలిని భావిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా అండర్19 క్రికెట్‌లో అదరగొట్టిన కొంతమంది ఆ తర్వాత జాతీయ జట్టులోకి రాకుండానే తమ కెరీర్‌లకు స్వస్థి చెప్పాల్సి వస్తుంది. దీంతో జాతీయ జట్టుకు నైపుణ్యం ఉన్న క్రికెటర్లు దూరం అవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అండర్ 19 తర్వాత జాతీయ ఏ జట్టులో చోటు దక్కని టాలెండెట్ క్రికెటర్లకు నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ ఇస్తూ.. వారిని క్రికెట్‌కు దూరం కాకుండా చూడాలని, జాతీయ జట్టుకు ఎంపికైయ్యేలా తీర్చిదిద్దాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
మరి ఈ ప్లాన్ కార్యరూపం దాల్చితే.. ఎంతో మంది అండర్19 క్రికెటర్లకు వరంలా మారనుంది. ఇండియా ఏ జట్టుకు రంజీ జట్లకు పోటీ అధికంగా ఉంటుంది. అండర్ 19 ప్లస్ క్రికెటర్లు అప్పటికే రంజీ, ఇండియా ఏ జట్లలో నిండి ఉంటారు. దీంతో అండర్19లో అద్భుత ప్రదర్శన చేసినా కూడా ఆయా జట్లలో చోటు దక్కడం కష్టమవుతోంది. దీంతో బీసీసీఐ తీసుకురానున్న కొత్త ప్లాన్ కుర్రాళ్లకు చాలా బాగా హెల్ఫ్ అవుతుంది. మరి బీసీసీఐ కొత్త ఆలోచనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.