టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా మళ్లీ జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. న్యూజిలాండ్‌తో ఈ నెలలో జరిగే టీ20 సిరీస్ కోసం పృథ్వీ షాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. తాజాగా రంజీ మ్యాచ్‌లో పృథ్వీ షా ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. కాగా.. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో సత్తా చాటి.. 2018లోనే టీమిండియాలోకి వచ్చిన షా.. కొన్ని మ్యాచ్‌ల తర్వాత పూర్ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయాడు. అప్పటి నుంచి మళ్లీ తిరిగి టీమిండియాకు ఆడాలని దేశవాళీ క్రికెట్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కానీ.. చాలా సార్లు అవకాశం వస్తుందని భావించిన తరుణంలో చోటు దక్కకా చాలా నిరాశ చెందాడు. ఆ క్రమంలోనే సాయిబాబా అంతా చూస్తున్నాడంటూ.. ఒక ఎమోషనల్ ట్వీట్ కూడా చేశాడు. అప్పట్లో ఆ ట్వీట్ తెగవైరల్ అయింది. ఇప్పుడు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం ఎంపిక కావడంతో.. ‘సాయిబాబా కరుణించాడు’ అంటూ అతని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.
ఇక పృథ్వీ షాకు జట్టులో చోటు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుండగా.. మరో ఇద్దరికి మాత్రం తీవ్ర అన్యాయం జరిగిందంటూ.. క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. వాళ్లిద్దరికీ కూడా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైన ఉందని అభిప్రాయపడుతున్నారు. బీసీసీఐ జట్లను ప్రకటించిన వెంటనే.. చాలా మంది క్రికెట్ అభిమానులు.. ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు సంజు శాంసన్‌కు అన్యాయం జరిగిందంటూ.. సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. అయితే శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపికైన సంజు శాంసన్ తొలి వన్డే ఆడి.. గాయం కారణంగా సిరీస్‌కు దూరం అయ్యాడు. అయితే.. అతను ఇప్పటికీ గాయం నుంచి కోలుకున్నాడా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు.
అలాగే సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం నిజంగానే అన్యాయం జరుగుతుందని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయాపడుతున్నారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న సర్ఫారాజ్ ఖాన్ టీమిండియాలో స్థానం కోసం ఎప్పటి నుంచో కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నాడు. అయినా కూడా సర్ఫరాజ్‌కు ప్రతిసారి నిరాశే మిగులుతోంది. తాజాగా ముంబై నుంచి పృథ్వీ షా సైతం టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తున్నా.. అతని కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నా.. సర్ఫరాజ్ ఖాన్‌కు జట్టులో స్థానం దక్కడం లేదు. సర్ఫరాజ్ రంజీల్లో తన చివరి 13 ఇన్నింగ్స్‌ల్లో ఒక ట్రిపుల్ సెంచరీ, రెండు డబుల్ సెంచరీలు, మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. అతను కొట్టిన స్కోర్లు వరుసగా.. 71, 36, 301, 226, 25, 78, 177, 6, 275, 63, 48, 165, 153 ఉన్నాయి. ఇంత నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నా.. సెలెక్టర్లు మాత్రం అతనిపై కరుణ చూపడంలేదని క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sarfaraz Khan in Ranji trophy since 2019:
71*, 36, 301*, 226*, 25, 78, 177, 6, 275, 63, 48, 165, 153, 40, 59*, 134, 45, 5, 126*, 75, 20, 162
•Innings – 22
•Runs – 2289
•Average – 134.64
•100s/50s – 9/5
•200s/300s – 3/1 pic.twitter.com/8Xi87El6B0— Aniket Anjan 🇮🇳🇮🇳 (@AnjanAniket) January 13, 2023