సుమారు ఆరేళ్ల తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లింది టీమిండియా. అక్కడ కేఎల్ రాహుల్ సారధ్యంలోని టీమిండియా జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే ప్రస్తుతం ఆ దేశం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కుంటున్నది. ఈ విషయంపై టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది.బాత్‌రూముల్లో గంటలకు గంటలు ఉంటూ నీటిని వృథా చేయవద్దంటూ కీలక సూచన చేసింది. ఐదు నిమిషాల్లో స్నానం ముగించుకుని రావాలని, నీటిని కాపాడాలని సూచించింది.
జింబాబ్వేలో ప్రస్తుతం నీటి కొరత తీవ్రంగా ఉంది. గొంతు తడుపుకునేందుకు అక్కడి ప్రజలు నానాకష్టాలు పడుతున్నారు. మంచినీళ్ల కోసం ట్యాంకర్లు, ప్రభుత్వ నల్లాల వద్ద బారులు తీరుతున్నారు. కొందరు షాపుల్లో దొరికే వాటర్ క్యాన్లను కొనుక్కొని ఇంటి అవసరాలకు వాడుతున్నారు. ముఖ్యంగా వన్డే సిరీస్ జరగనున్న జింబాబ్వే రాజధాని హరారేలో వారానికి ఒకసారి మాత్రమే తాగేనీరు వస్తుండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. జింబాబ్వేలో ప్రతి ఏడాదీ ఈ సీజన్లో నీటి కొరత సర్వసాధారణం. అయితే 2019లో అక్కడి ప్రజలకు తాగునీరు లేక కలుషితమైన నీటినే తాగాల్సి వచ్చినట్టు గతంలో వార్తలు వచ్చాయి.
📍Harare , Mabelreighn
Water pic.twitter.com/S3gr87I3uI
— Alexander Gusha ❁ (@ZEZURUROCKSTAR) August 15, 2022
ఈసారి కూడా నీటిని శుద్ది చేసే యంత్రాలు పాడవడంతో ప్రజలు తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారత క్రికెటర్లకు బీసీసీఐ కీలక సూచన చేసింది. “జింబాబ్వేలో నీటి కొరత ఉంది. వన్డే సిరీస్ జరగాల్సి ఉన్న హరారే నగర ప్రజలు నీటి కోసం చాలా ఇబ్బందులు మా దృష్టికి వచ్చింది. దీంతో మేం క్రికెటర్లందరూ నీటిని జాగ్రత్తగా వాడానలి సూచించాం. తక్కువ సమయంలో స్నానాలు, ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని క్రికెటర్లకు చెప్పాం. నీటి కొరత కారణంగా స్విమ్మింగ్ పూల్స్ లో జలకాలాటలు వంటివి అన్ని రద్దు చేశాం”అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. టీమిండియాకు ఇలాంటి అనుభవం తొలిసారి కాదు.
2018లో భారత జట్టు సౌతాఫ్రికాకు వెళ్లినప్పడూ ఇదే పరిస్థితి ఎదురైంది. టీమిండియాకు విదేశీ పర్యటనలలో ఇలా నీటి కొరత ఎదురువడం ఇది తొలిసారి కాదు. గతంలో 2018లో భారత జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లినప్పుడూ ఇదే పరిస్థితి తలెత్తింది. అప్పుడు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి క్రికెటర్ల అవసరాలను తీర్చారు. తాము ప్రజల నీటి కొరతను చూశామని, సర్దుబాటు అలవాటు చేసుకుంటున్నామని ఒక భారత క్రికెటర్ పేర్కొన్నారు. మరి..బీసీసీఐ తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
1/ Harare West in particular & other parts of Harare have had no running water for the past 3 weeks. This is a clear violation of section 77 of the constitution of Zimbabwe which enshrines the right to safe, clean & potable water. Water is life, the unavailability of it,…
— Linda Tsungirirai Masarira (@lilomatic) August 15, 2022