ఐపీఎల్ లో ఆడే భారత క్రికెటర్లు ఏ ఇతర టీ20 లీగ్స్ లో ఆడకూడదు అన్న నిబంధన మనకు తెలిసిందే. ఈ విషయంలో బీసీసీఐను ప్రశంసించాడు పాక్ మాజీ ఆటగాడు. అలాగే ప్రపంచంలోని ఏ టీ20 లీగ్ కూడా IPLకు సాటిరాదు అని పేర్కొన్నాడు.
ప్రపంచంలో ఎన్నో టీ20 లీగ్ లు ఉన్నాయి. కానీ ఏ టీ20 లీగ్ కూడా ఐపీఎల్ కు సాటిరాదు అనేది కాదనలేని వాస్తవం. డబ్బులో అయినా, క్రేజ్ లో అయినా వరల్డ్ లోని ఏ పొట్టి లీగ్ కూడా ఐపీఎల్ దరిదాపుల్లోకి రాదు. అంత పకడ్బందీగా ఈ లీగ్ ను నిర్వహిస్తోంది బీసీసీఐ. ఇక ఐపీఎల్ లో ఆడే భారత ఆటగాళ్లు ఏ ఇతర టీ20 లీగ్స్ లో ఆడకూడదు అన్న నిబంధన ఉన్న విషయం తెలిసిందే. ఈ నిబంధనను సమర్థిస్తూ.. ఈ విషయంలో పాకిస్థాన్ బోర్డు బీసీసీఐ నుంచి చాలా నేర్చుకోవాలి అని పాక్ మాజీ ఆటగాడు కామెంట్స్ చేశాడు.
ఐపీఎల్ లో ఆడే భారత క్రికెటర్లు ఏ ఇతర టీ20 లీగ్స్ లో ఆడకూడదు అన్న నిబంధన మనకు తెలిసిందే. ఈ విషయంలో బీసీసీఐను ప్రశంసించాడు పాక్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్. బీసీసీఐ అలా టీమిండియా ఆటగాళ్లను ఇతర లీగ్ లు ఆడేందుకు అనుమతించకపోవడం మంచి విషయమే అని తెలిపాడు. కాగా ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ 8వ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో టీమిండియా ఆటగాళ్లకు పీఎస్ఎల్ ఆడటానికి అనుమతి లభిస్తే ఎలా ఉంటుంది అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు అక్మల్.
కమ్రాన్ అక్మల్ ఆన్సర్ ఇస్తూ..”విదేశీ లీగ్ లల్లో టీమిండియా ప్లేయర్స్ ను ఆడించే విషయంలో బీసీసీఐ సరైన దిశలోనే పయనిస్తోంది. ఇక భారత క్రికెటర్లు పీఎస్ఎల్ లో అస్సలు ఆడరు, వాళ్లకు ఆడాల్సిన ఖర్మ కూడా లేదు. వారికి ఐపీఎల్ ద్వారా కోట్లలో డబ్బులు వస్తున్నాయి. అలాంటప్పుడు ఇతర లీగ్ లు ఆడాల్సిన అవసరం ఏముంది వారికి?” అని కమ్రాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు. ఇక అక్కడ బీసీసీఐ పాటిస్తున్న విధానాల నుంచి పీసీబీ చాలా విషయాలు నేర్చుకోవాలి అని అక్మల్ అన్నాడు. ఇండియన్ ఆటగాళ్లలో 100 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన క్రికెటర్లు 15 మంది దాకా ఉంటే.. పాక్ లో మాత్రం ఒక్కరో, ఇద్దరో ఉంటారు అని పాక్ పరువు తీశాడు అక్మల్. ఇక పోతే ఐపీఎల్ ముందు ఏ లీగ్ లు పనికిరావు అని తేల్చిచెప్పాడు. భారతదేశ ప్రజలు క్రికెటర్లకు, క్రికెట్ కు విలువిస్తారని చెప్పుకొచ్చాడు. మరి పాక్ బోర్డుపై అక్మల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.