ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో అంతా యూఏఈ, సౌత్ ఆఫ్రికా లీగ్‌ల గురించే చర్చ నడుస్తోంది. సౌత్ ఆఫ్రికా లీగ్ లో అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీలే అక్కడ జట్లను కొనుగోలు చేశారు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. ఎంఐ కేప్ టౌన్ అని టీమ్‌ని కూడా పరిచయం చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా జోహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ జట్టును కొనుగోలు చేసింది. ఆ జట్టుకు ఎంఎస్ ధోనీని మెంటర్‌గా పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
అందుకోసం బీసీసీఐని అనుమతి కోరింది. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు చెప్పాడు. ఒక్క ఐపీఎల్ తప్ప మరే లీగ్‌లు, మ్యాచ్లు ఆడటం లేదు. కాబట్టి బీసీసీఐ తప్పకుండా ధోనీకి అనుమతి ఇస్తుందని అంతా భావించారు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా అదే భావించింది. కానీ, బీసీసీఐ మాత్రం అందరికీ పెద్ద షాకిచ్చింది. ధోనీ ఇంకా ఐపీఎల్ ఆడుతున్నాడని.. వచ్చే సీజన్లోనూ చెన్నైకి ఆడతానని ప్రకటించాడనే విషయాలను గుర్తు చేసింది.
విదేశీ లీగ్‌లు ఆడాలి అనుకుంటే బీసీసీఐతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది ఐపీఎల్, దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లు అన్నింటికి వీడ్కోలు పలకాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ రూల్ విషయంలో ధోనీ కాదు కదా ఇంకెవరైనా సరే పాటించాల్సిందేనని చెప్పింది. ఈ సమధానంతో చెన్నై యాజమాన్యం, ధోనీ ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఐపీఎల్ ని కాదని ధోనీ సౌత్ ఆఫ్రికా లీగ్‌కు వెళ్లడని టాక్ వినిపిస్తోంది.
విదేశీ లీగ్ల విషయంలో బీసీసీఐ ఎప్పటినుంచే అదే రూల్‌పై నడుస్తోంది. ఇకపై కూడా అదే రూల్ కొనసాగుతుందని ఈ సందర్భంగా మరోసారి తేల్చి చెప్పింది. అయతే ధోనీ ప్లేయర్ గా కాకుండా మెంటర్ గానే వ్యవహరిస్తాడు కాబట్టి అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ, బీసీసీఐ ఇచ్చిన స్టేట్మెంట్‌తో అంతా షాకయ్యారు. విదేశీ లీగ్ల విషయంలో బీసీసీఐ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.