రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా వెస్టిండీస్ టూర్‌లో అదరగొడుతున్న టీమిండియాకు మరో కొత్త కోచ్ వచ్చాడు. గతంలో టీమిండియాకు కోచ్‌గా పనిచేసిన గ్యారీ క్రిస్టన్‌కు అసిస్టెంట్‌గా పనిచేసిన పడ్డి అప్టన్‌ను మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా బీసీసీఐ నియమించింది. సౌతాఫ్రికాకు చెందిన అప్టన్ 2008 నుంచి 2009 వరకు టీమిండియాకు సపోర్టింగ్ స్టాఫ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఆ సమయంలోనే టీమిండియా ధోని కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్‌ను సాధించింది.
ఆ తర్వాత గ్యారీ క్రిస్టన్‌తో పాటు సౌతాఫ్రికా జట్టుకు సపోర్టింగ్ స్టాఫ్‌గా వెళ్లాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ద్రవిడ్ పిలుపుపై టీమిండియాకు మెండల్ కండిషనింగ్ కోచ్‌గా ఉండేందుకు అంగీకరించి వచ్చినట్లు సమాచారం. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రాహుల్ ద్రవిడ్ అప్టన్ కలిసి పనిచేశారు. కాగా అక్టోబర్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని అప్టన్‌ను తీసుకోవాల్సిందిగా టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ బీసీసీఐకి సూచించినట్లు తెలుస్తుంది. దీనికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా మద్దతు తెలిపినట్లు సమాచారం.
అప్టన్.. ఆటగాళ్ల మానసిక స్థితిని నిలకడగా ఉంచేందుకు.. ఒత్తిడికి గురికాకుండా ఆటపై ఏకాగ్రతతో ఉండేలే చేయగల సమర్థుడు. గతంలో టీమిండియా 2007 ప్రపంచ కప్‌కు ముందు రూడీ వెబ్‌స్టర్, 2003 ప్రపంచ కప్‌లో శాండీ గోర్డాన్ వంటి వారిని మెంటల్ కండిషనింగ్ కోచ్‌లుగా నియమించింది. మరి ఈ కొత్త నియామకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Say Hello 👋🏻 to our Mental Conditioning Coach – Mr. Paddy Upton 😃#TeamIndia 🇮🇳 pic.twitter.com/KEjpnXuC81
— BCCI (@BCCI) July 26, 2022