భారత మహిళా క్రికెటర్లు అద్భుతం చేసి చూపించారు. అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా విమెన్స్ జట్టు ముద్దాడింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్ టైటిల్‌ను గెలిచి మహిళా క్రికెటర్లు చరిత్ర సృష్టించారు. అరంగేట్ర అండర్-19 ప్రపంచకప్‌లోనే సంలచన విజయాన్ని అందకున్నారు. మహిళల క్రికెట్‌లో ఏ విభాగంలోనైనా టీమిండియాకు ఇదే తొలి ఐసీసీ టైటిల్ కావడం కావడం విశేషం. సీనియర్ విమెన్స్ టీమ్ ఇప్పటికే మూడు సార్లు వన్డే, టీ20 వరల్డ్ కప్‌ల్లో ఫైనల్స్‌కు చేరింది. కానీ టైటిల్‌ను చేజిక్కుంచుకోవడంలో విఫలమైంది. కానీ షెఫాలీ సేన మాత్రం ఈసారి అవకాశాన్ని మిస్సవ్వలేదు. ఇంగ్లండ్‌ను ఓడించి కప్ ఒడిసిపట్టిన యంగ్ ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. భారత జట్టుకు రూ. 5 కోట్లు అందించనున్నట్లు బోర్డు కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో తెలిపారు.
‘ఇది మనందరం గర్వించదగ్గ తరుణం. దేశంలో విమెన్స్ క్రికెట్‌కు ఈ విజయం మరింత తోడ్పాటునందిస్తుంది. ఈ గెలుపులో భాగస్వాములైన ప్లేయర్లు, సిబ్బందికి రూ. 5 కోట్లు నజరానాగా ఇవ్వనున్నాం’ అని అందులో జై షా పేర్కొన్నారు. ప్రపంచ కప్‌తో తిరిగొస్తున్న షెఫాలీ వర్మ బృందానికి ఫిబ్రవరి 1వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఘనంగా సత్కరిస్తామని షా చెప్పారు. ఇకపోతే, ఆదివారం జరిగిన ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 రన్స్‌కే కుప్పకూలింది. భారత బౌలర్లు సధు, అర్చనా దేవి, పర్షావి చోప్రా రెండేసి వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. మన్నత్ కశ్యప్, షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ తలో వికెట్ తో ప్రత్యర్థి పనిపట్టారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత అమ్మాయిలు 14 ఓవర్లలోనే 3 వికెట్లకు 69 రన్స్ చేసి మ్యాచ్ తో పాటు కప్‌ను సొంతం చేసుకున్నారు. సౌమ్య తివారీ (24), తెలంగాణ అమ్మాయి గొంగిడి త్రిష (24) టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు. షెషాలీ వర్మ (15), శ్వేతా సెహ్రావత్ (5) విఫలమైనా.. సౌమ్య, త్రిష కలసి చక్కటి భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో హన్నా బేకర్, గ్రేస్ స్క్రీవెన్స్ చెరో వికెట్ తీశారు.