India A vs New Zealand A: పదేళ్ల క్రితం మ్యాచులు ఎప్పుడు జరుగుతాయా, షెడ్యూలు ఎప్పుడు ప్రకటిస్తారా.. అని క్రికెట్ ప్రేమికుల వేయి కళ్ళతో ఎదురుచూసేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు.. ఐసీసీ టోర్నమెంట్లు, ద్వైపాక్షిక సిరీసులు, డొమెస్టిక్ లీగులు.. ఇవికాక స్వదేశీ టీ20 లీగులు.. అబ్బో ఇలా ఒక్కటేమిటి ఏడాదికి వెయ్యికి పైగా మ్యాచులు. క్రికెట్ ప్రేమికులకు ఇంతకన్నా ఏం ఎంటర్టైన్ కావాలండి. ఒకవైపు భారత జట్టు, ఆసియా కప్ టోర్నీలో టైటిల్ ఫేవరైట్ గా బరిలోకి దిగితుంటే.. మరోవైపు భారత్- ‘ఎ’ జట్టు, న్యూజిలాండ్-‘ఎ’ తో తలపడనుంది.
స్వదేశంలో న్యూజిలాండ్-‘ఎ’ తో జరగబోయే టెస్టు(నాలుగు రోజుల మ్యాచ్), వన్డే సిరీస్‌కు భారత్- ‘ఎ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో హనుమ విహారి, వాషింగ్టన్ సుందర్, కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లకు చోటు కల్పించారు. అలాగే.. రంజీట్రోఫీ (2021-22) హీరోలైన యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, షామ్స్ ములానీ, యష్ దూబే వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ లో న్యూజిలాండ్ ‘ఏ’ జట్టు మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. బెంగళూరు వేదికగా టెస్టు సిరీస్ జరగనుండగా, చెన్నై వేదికగా వన్డే సిరీస్ జరగనుంది.
షెడ్యూలు:
భారత్-ఏ జట్టు (నాలుగు రోజుల మ్యాచ్): శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), యశ్ దూబే, హనుమ విహారి, రజత్ పటీదార్, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, షమ్స్ ములానీ, జలజ్ సక్సేనా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మద్, శుభమ్ శర్మ, అక్షయ్ వాడ్కర్, మణిశంకర్ మురాసింగ్.
న్యూజిలాండ్-ఏ జట్టు: టామ్ బ్రూస్ (కెప్టెన్), రాబీ ఓ డానెల్, చాద్ బోవ్స్, జో కార్టర్, మార్క్ చాప్‌మన్, డేన్ క్లీవర్ (వికెట్ కీపర్), జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, కామెరాన్ ఫ్లెచర్ (వికెట్ కీపర్), బెన్ లిస్టర్, రచిన్ రవీంద్ర, మైఖేల్ రిప్పన్ , సీన్ సోలియా, లోగాన్ వాన్ బీక్, జో వాకర్.
Shubman Gill will captain India A side against the New Zealand A for both one-day and 4-day matches.#ShubmanGill #IndiaA #INDAvsNZA #HanumaVihari #SarfarazKhan pic.twitter.com/ahx0v241HW
— Bet Barter (@BetBarteronline) August 21, 2022