గాలే వేదికగా పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మూడో రోజు ఆట జరుగుతున్న సమయంలో స్టేడియంలో అభిమానుల సెలబ్రేషన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. స్టాండ్స్ లేని కేవలం గ్రాస్ ఉన్న ప్రాంతంలో పలువురు శ్రీలంకన్, పాకిస్థాన్ అభిమానులు కలిసి ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ స్టైల్లో స్టెప్పులు వేశారు.
తెలంగాణలో బతుకమ్మ ఎంత పెద్ద పండగో అందరికి తెసిలిందే. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ. పూలను పొందికగా పేర్చి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఓ సారి కింద చప్పట్లు కొట్టి మరోసారి పైకి లేసి భుజాల వద్ద చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటతో తెలంగాణ ఆడపడుచులు పండుగ జరుపుకుంటారు. సేమ్ అదే తరహాలో ఈ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు స్టేడియంలో స్టెప్పులేసి అలరించారు.
పైగా పాకిస్థాన్, శ్రీలంక అభిమానులు తమ దేశాల జెర్సీలు ధరించి.. జెండాలు పట్టుకుని ఈ రకంగా సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. ఈ సెలబ్రేషన్‌పై శ్రీలంక క్రికెట్ సైతం తన అధికారిక ట్విట్టర్‌లో స్పందించింది. ఈ వీడియోను పోస్టు చేస్తూ.. కొత్త రకం డ్యాన్స్ నేర్చుకోవడానికి టైమొచ్చిందంటూ క్యాప్షన్ ఇచ్చింది.
అయితే నిజానికి ఇది బతుకమ్మ డ్యాన్స్ కాదు. పాకిస్థాన్‌లో గర్బా అని పిలిచే ఓ సంప్రదాయ నృత్యం. దీన్నే లుడ్డీ, సొంబీ, జాహ్మర్ అని కూడా అంటారు. కాగా వారి నృత్యం చూస్తే తెలంగాణ వాళ్లు ఎవరైనా సరే అరే బతుకమ్మ ఆడుతున్నారేంటి అనే ఆసక్తి కలుగుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఇక శ్రీలంక- పాకిస్థాన్ మధ్య మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో రోజు శ్రీలంక కాస్త పాక్ మీద ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసి దీంతో 323 పరుగుల ఆధిక్యంతో విజయావకాశాలను మెరుగు పర్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 231పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో రమేష్ మెండిస్ మరోసారి 5 వికెట్ల హాల్ సాధించగా.. స్పిన్ సంచలనం ప్రభాత్ జయసూర్య సైతం మూడు వికెట్లతో చెలరేగి పాక్ పతనాన్ని శాసించాడు. మరి స్టేడియంలో పాక్-శ్రీలంక అభిమానుల సెలబ్రేన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Time to learn some new dance moves 🕺💃#SLvPAK pic.twitter.com/TvQPwadt91
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 26, 2022