ప్రపంచ క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ను ఇప్పటికీ ఒక పసికూన జట్టుగానే చూస్తుంటారు. నిజానికి బంగ్లాదేశ్‌ను మరీ అంత తీసిపారేయలేం. వారిదైన రోజు ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించే సత్తా వారికుంది. వరల్డ్ కప్ వేదికగాపై చాలా సార్లు ఛాంపియన్ జట్లకు షాకిచ్చారు బంగ్లా టైగర్స్. తాజాగా టీమిండియా లాంటి పెద్ద టీమ్‌పై సిరీస్ గెలిచి.. అద్భుతం చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి హేమాహేమీలతో నిండిన జట్టును రెండు వరుస మ్యాచ్‌ల్లో ఓడించి చరిత్ర సృష్టించింది. పైగా ఈ విజయాలు బంగ్లాదేశ్‌కు ఏదో గాలివాటంగా రాలేదు.. దాదాపు ఓడిపోయే స్థితి నుంచి అద్భుత పోరాటం విజయం సాధించింది. 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా.. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది అయితే.. ఒక విషయంలో మాత్రం బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్‌లో ఉంది.
ఏ టీమైనా స్వదేశంలో మ్యాచ్‌లు ఆడుతుంటే.. వారికి కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. అతిథి జట్టుకు అక్కడి పిచ్‌లు, వాతావరణ పరిస్థితులపై అంతగా అవగాహన ఉండగా పోవడం, అవే పిచ్‌లపై కొన్నేళ్లుగా ఆడుతున్న ఆ దేశపు ఆటగాళ్లకు ఆ పిచ్‌లపై మంచి పట్టు, బ్యాటింగ్ చేసిన అనుభవం ఉండటంతో వారికి కచ్చితంగా అక్కడ కాస్త హెల్ప్ లభిస్తుంది. ఆస్ట్రేలియా పిచ్‌లపై ఆస్ట్రేలియాన్లు, సౌతాఫ్రికా పిచ్‌లపై ప్రోటీస్ జట్టు, మన దేశపు పిచ్‌లపై టీమిండియా ఆటగాళ్లు చెలరేగడం సహజం. కానీ.. ఈ అనుకూలత కేవలం పెద్ద దేశాల జట్లకు మాత్రమే ఉంటుంది. రెండు సమవుజ్జీల మధ్య మ్యాచ్ జరిగితే.. పిచ్ అనుకూలంగా ఉండటం అనేది ఒక చిన్న అడ్వాంటేజ్ మాత్రమే. దాన్ని అధిగమిస్తే.. అతిథ్య జట్టు సైతం అతిథ్యం ఇచ్చే జట్టుపై విజయం సాధిస్తుంది.
కానీ.. ఒక పసికూన జట్టుకు వారి దేశంలోని పిచ్‌లపై ఎంత మంచి పట్టు ఉన్నా.. ప్రత్యర్థి జట్టు బలమైన జట్టు అయితే.. అవేవి పనికి రావు. ఆస్ట్రేలియా జింబాబ్వే వెళ్లి వారిని అక్కడ కూడా ఓడించగలదు. ఎప్పుడో పుష్కర కాలానికి వెళ్లిన టీమిండియా అక్కడి జట్టును ఓడించింది. కానీ.. ఈ విషయం బంగ్లాదేశ్ మాత్రం పసికూన జట్ల సరసన చేరడం లేదు. ప్రత్యర్థి ఎంత బలమైన టీమ్ అయినా.. స్వదేశంలో మాత్రం వారిని ఓడించడం అంత సామన్యమైన విషయం కాదు. అంతేందకు 2012 నుంచి స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌ల్లో అత్యధిక విజయాలు వారి ఖాతాలోనే ఉన్నాయి. ఈ విషయంలో బంగ్లాదేశ్ ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ టీమ్‌గా ఉంది. 2012 నుంచి స్వదేశంలో 57 మ్యాచ్‌లు ఆడిన బంగ్లా 40 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. స్వదేశంలో వారి విజయశాతం 70.18. ఇంతటి భారీ విజయ శాతం ఇండియాకు కూడా లేదు.
57 మ్యాచ్‌ల్లో 40 విజయాలు 16 అపజయాలు ఒక ఫలితం తేలని మ్యాచ్‌లో ప్రస్తుతం బంగ్లాదేశ్.. ఆస్ట్రేలియాతో అగ్రస్థానాన్ని పంచుకుంటుంది. టీమిండియాతో చివరి మ్యాచ్ కంటే ముందు కేవలం 56 మ్యాచ్‌ల్లో 40 విజయాలతో బంగ్లాదేశ్ వరల్డ్ నంబర్ వన్ టీమ్ ఉండేది. కానీ.. శనివారం చివరి వన్డేలో భారత్ చేతిలో ఓడిపోవడంతో ఆస్ట్రేలియాతో కలిసి అగ్రస్థానం పంచుకోవాల్సి వస్తుంది. ఇక ఈ లిస్ట్‌లో 2012 నుంచి స్వదేశంలో 74 మ్యాచ్‌లు ఆడిన ఇండియా 47 విజయాలు, 25 ఓటములతో ఆరో స్థానంలో ఉంది. కాగా.. బంగ్లాదేశ్ స్వదేశంలో ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, జింబాబ్వే, అఫ్ఘానిస్థాన్, వెస్టిండీస్ లాంటి జట్లను ఓడించింది. అయితే.. 2012 నుంచి కేవలం ఒక్క ఇంగ్లండ్‌పై మాత్రమే సిరీస్ ఓడింది.
Bangladesh in bilateral ODI series at home since Nov 2014 👇
Won ✅
5-0 vs ZIM
3-0 vs PAK
2-1 vs IND
2-1 vs SA
3-0 vs ZIM
2-1 vs AFG
3-0 vs ZIM
2-1 vs WI
3-0 vs ZIM
3-0 vs WI
2-1 vs SL
2-1 vs AFG
2-0* vs INDLost ❌
1-2 vs ENG pic.twitter.com/ohV5076HIq
— ESPNcricinfo (@ESPNcricinfo) December 7, 2022
— Hardin (@hardintessa143) December 8, 2022