బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ సౌతాఫ్రికాలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంపైర్ల తీరుపై అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కింగ్స్ మెడ్ టెస్టు మ్యాచ్ కు సంబంధించి తాము పూర్తి అసంతృప్తితో ఉన్నట్లు సోమవారం వెల్లడించారు. అంతేకాకుండా అంపైరింగ్ పై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! యూట్యూబ్‌లో IPL లైవ్!
అంపైర్ల నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా రావడమే కాకుండా.. చాలాసార్లు తమ ఆటగాళ్లు తీవ్రమైన స్లెడ్జింగ్ కు గురైనట్లు ఆరోపించారు. ఏడ్రియన్ థామస్ హోల్డ్ స్టాక్- మరైస్ ఎరాస్మస్ అంపైరింగ్ ఆశించిన స్థాయిలో లేదని విమర్శించారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ జలాల్ యూనస్ సిరీస్ తర్వాత అంపైరింగ్ పై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. వన్డే సిరీస్ పై ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ‘వారి నిర్ణయాలను మాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది చూశారు. కానీ, తుది నిర్ణయం వారిదే కాబట్టి చూస్తూ ఉండిపోయాం. రెండో టెస్టు తర్వాత వీటన్నింటిపై మేము మాట్లాడతాం. స్లెడ్జింగ్ విషయంలో రెండు జట్లకు సర్దిచెప్పాల్సింది పోయి కేవలం మా ఆటగాళ్లనే మందలించారు. రెండో టెస్టులోనైనా సరైన అంపైరింగ్ చూస్తామేమో’ అంటూ బంగ్లాదెశ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ జలాల్ ఆకాంక్షించారు.సిరీస్ విషయానికి వస్తే.. మూడు వన్డేలు, రెండు టెస్టు సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తోంది. ఇప్పటికే వన్డే సరీస్ ను 2-1 తేడాతో బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. ఇంక రెండు టెస్టుల సిరీస్ లో మొదటి టెస్టును 220 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. రెండో టెస్టు ఏప్రిల్ 12 నుంచి పోర్ట్ ఎల్జిబెత్ లో ప్రారంభం కానుంది. జలాల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Bangladesh will lodge an official complaint about South Africa’s “deplorable” sledging during the Durban Test.
The BCB is planning to complain to the ICC about both the sledging as well as the overall umpiring during the gamehttps://t.co/lJfnlKcl6O#SAvBAN #WTC23 #ESPNCaribbean pic.twitter.com/SdKrkfgBbu— ESPN Caribbean (@ESPN_Caribbean) April 4, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.