టీ20 వరల్డ్ కప్ 2022ను గెలిచి.. ఛాంపియన్‌గా నిలిచన జట్టు ఆ తర్వాత ఆడిన తొలి టీ20 సిరీస్‌లో బొక్కబోర్లా పడింది. అది కూడా పసికూన బంగ్లాదేశ్ చేతిలో 0-3తో క్లీన్ స్వీప్‌కు గురై పరువు పోగొట్టుకుంది.
ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022ను గెలిచి, టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన జట్టు, ప్రపంచ క్రికెట్‌లో సీనియర్ పసికూనగా పేరొందిన బంగ్లాదేశ్ మట్టికరిపించింది. మూడు టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ను వైట్‌వాష్ చేసి.. చరిత్ర సృష్టించింది. పైగా ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆడిన తొలి టీ20 సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఈ సిరీస్ ఓటమితో ఇంగ్లండ్ పరువు పోయిందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ప్రపంచ ఛాంపియన్ అయిన జట్టు.. ఇలా అత్యంత దారుణంగా 0-3తో తేడాతో ఓడిపోవడంపై ఇంగ్లండ్ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. వన్డే సిరీస్‌ను స్థాయికి తగ్గట్లు ఆరంభించిన ఇంగ్లండ్ తొలి రెండు వన్డేల్లో గెలిచి.. సత్తా చాటింది. కానీ, చివరి వన్డేలో బంగ్లా చేతిలో ఓడిపోయింది. అయినా కూడా బంగ్లాదేశ్ పిచ్‌లపై ఒక ఓటమి కామనే అని క్రికెట్ ఫ్యాన్స్ సరిపెట్టుకున్నారు. ఇంగ్లండ్ 2-1తో వన్డే సిరీస్ నెగ్గిందిలే అని సర్దిచెప్పుకున్నారు. చివరి వన్డేలో ఇంగ్లండ్‌ను ఓడించిన కాన్ఫిడెన్స్‌తో టీ20 సిరీస్ బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు.. ఊహించని విధంగా మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి చరిత్ర సృష్టించింది. తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచిన బంగ్లా, రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మంగళవారం ఢాకా వేదికగా జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ లిటన్ దాస్ 57 బంతుల్లో 10 ఫోర్లు ఒక సిక్స్‌తో 73 పరుగులు చేసి అదరగొట్టాడు. షాంటో సైతం 36 బంతుల్లో 47 రన్స్ చేసి రాణించాడు. చూసేందుకు ఓ మోస్తారు టార్గెట్‌గానే ఉన్నా.. బంగ్లా బౌలింగ్ ముందు ఇది టఫ్ టార్గెట్‌గా మారింది. ఇంగ్లండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్ 53 రన్స్‌తో పాటు, కెప్టెన్ జోస్ బట్లర్ 40 పరుగులు చేసి రాణించినా.. ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయింది. వీళ్లద్దరు మినహా.. మిగతా బ్యాటర్లు విఫలం అవ్వడంతో ఇంగ్లండ్ 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బౌలర్లలో ఇస్లామ్, షకీబ్ అల్ హసన్, రెహమాన్ చెరో వికెట్ తీసుకున్నారు. టస్కిన్ అహ్మాద్ రెండు వికెట్లతో రాణించారు. ముస్తఫీజుర్ రెహమాన్ 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి.. ఇంగ్లండ్ ఓటమిని శాసించాడు. మరి ఇంగ్లండ్‌ను బంగ్లాదేశ్ మూడు టీ20ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
BANGLADESH SWEEP THE T20 WORLD CHAMPIONS 3-0! 🇧🇩 #BANvENG pic.twitter.com/qGXGN54x2D
— ESPNcricinfo (@ESPNcricinfo) March 14, 2023