పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్. అతన్ని పాకిస్థాన్ విరాట్ కోహ్లీ అని కూడా అంటారు. అలాటి ఆటగాడిని ఈ లీగ్‌లోనైనా ఈజీ భారీ ధరకు అమ్ముడైపోతాడని అనుకుంటారు. అదే ఉద్ధేశంతో ప్రగల్భాలు కూడా పలుకుతారు. కానీ వాస్తవానికి వచ్చే సరికి పరిస్థితి వేరేలా ఉంటుంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న ది హండ్రెడ్ అనే లీగ్ 2022 సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం ఐపీఎల్‌లో నిర్వహించినట్లు ఆటగాళ్ల వేలం నిర్వహించారు.
ఈ వేలంలో పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజమ్ కూడా పేరు నమోదు చేసుకున్నాడు. కానీ ఆశ్చర్యకరంగా అతన్ని ఏ ఫ్రాంచైజ్ కూడా కొనుగోలు చేయలేదు. మొత్తం ఎనిమిది ఫ్రాంఛైజీలు ఇందులో పాల్గొన్నాయి. అలాగే అతని ఓపెనింగ్ పార్ట్‌నర్ మహ్మద్ రిజ్వాన్‌కు కూడా చుక్కెదురైంది. ఏ ఫ్రాంఛైజీ కూడా వారిద్దరినీ తమ జట్టులోకి తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. ఆస్ట్రేలియాపై సిరీస్‌లో బాబర్ అజమ్ అద్భుతంగా రాణించాడు. సెంచరీలు నమోదు చేశాడు. అయినా కూడా అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజ్ ఆసక్తి చూపకపోవడంతో ఈ విషయం ప్రస్తుతం టాక్ ఆఫ్‌ది క్రికెట్ టౌన్‌గా మారింది.
కాగా మొన్నీమధ్య.. పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. బాబర్ అజమ్ ఐపీఎల్ వేలంలో పాల్గొంటే.. అతన్ని దక్కించుకునేందుకు ఫ్రాంచైజ్‌లు పోటీ పడతాయని, ఈజీగా రూ.15 నుంచి రూ.20 కోట్ల ధర పలుకుతాడని కామెంట్ చేశాడు. కానీ.. ఇప్పుడు ది హండ్రెడ్ లీగ్‌లో అమ్ముడుపోకపోవడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘షోయబ్ అక్తర్.. ఐపీఎల్‌లో రూ.20 కోట్ల ధర పలుకుతాడన్న ప్లేయర్‌ను ఇక్కడ కనీసం పట్టించుకోలేదు’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IPLలో బాబర్ ఆజమ్- కోహ్లీ ఓపెనింగ్ చేస్తే చూడాలని ఉంది: అక్తర్
ENGLAND LEAGUE : THE HUNDRED 🔥🔥
BABAR AZAM !! UNSOLD 😂🤣
reason; Babar Azam playing PSL like test series 🤣
🔔 Ka world glass 🤣#PAKvsAUS #Pakistan #PAKvAUS pic.twitter.com/186CDwyAk6
— Suraj Pawar 🇮🇳 (@Surajp__india) April 6, 2022
The likes of David Warner and Babar Azam went unsold at #TheHundredDraft for 2022 👀
See who was picked up ⤵️
— ESPNcricinfo (@ESPNcricinfo) April 5, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.