పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్‌ను ఆ దేశపు క్రికెట్ అభిమానులే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మా బాబర్‌కు పిచ్చి అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. అయితే.. పాక్ క్రికెట్ అభిమానులే బాబర్ ఇంతలా హేళన చేయడానికి కారణం ఏమిటంటే.. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు సందర్భంగా బాబర్ అజమ్ తీసుకున్న నిర్ణయమే. స్వదేశంలో న్యూజిలాండ్‌తో పాక్ టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ తొలి టెస్టు శుక్రవారం డ్రాగా మాగిసింది. కానీ.. పాక్ ఓటమి అంచలకు వెళ్లి అంపైర్ల లైట్ ఫెయిల్ నిర్ణయంతో బతికిపోయింది. ఓటమి భయంతో పాక్ వణికిపోయేందుకు ప్రధాన కారణం ఆ జట్టు కెప్టెన్ బాబర్ తీసుకున్న నిర్ణయమే కారణం.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజమ్ 161 పరుగులతో పాటు అఘా సల్మాన్ సెంచరీతో చేయడంతో పాక్ మంచి స్కోరే చేసింది. అయితే.. న్యూజిలాండ్ సైతం పాక్‌కు గట్టి జవాబిచ్చింది. ఆ టీమ్ మాజీ టెస్ట్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతని కంటే ముందు ఓపెనర్ టాప్ లాథమ్ సైతం సెంచరీతో దుమ్మురేపడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 612 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్.. వేగంగా ఆడే ప్రయత్నం చేసి.. 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.
అయితే.. చివరి రోజు ఆట మరో 15 ఓవర్లలో ముగుస్తుందనే టైమ్‌లో.. అనూహ్యాంగా పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను 311 పరుగుల వద్ద డిక్లేర్ చేసి.. న్యూజిలాండ్‌కు 15 ఓవర్లలో 138 పరుగులను ఛేదించేలా ఛాలెంజ్ విసిరింది. ఈ ఛాలెంజ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కివీస్.. టీ20 స్టైల్లో బ్యాటింగ్ చేస్తూ.. పాక్‌కు ఓటమి భయపుట్టించారు. 7.3 ఓవర్లలోనే కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి.. 61 పరుగులు బాదేసింది. డెవాన్ కావ్వె 16 బంతుల్లో 18, లాథమ్ 24 బంతుల్లో 35 పరుగులతో మ్యాచ్‌ను గెలిపించేలా కనిపించారు. అయితే.. మరో 7.3 ఓవర్లు ఉన్న టైమ్‌లో ఫీల్డ్ అంపైర్లు లైట్ ఫెయిల్ అయిందని.. మ్యాచ్‌ను నిలిపివేశాడు. దీంతో పాకిస్థాన్ దాదాపు అంచులకు వెళ్లి బతికిపోయింది. మ్యాచ్ పూర్తిగా జరిగి ఉంటే.. పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ తీసుకున్న నిర్ణయం ఎంతో దారుణమైన ఫలితాన్ని ఇచ్చేదో అర్థమయ్యేది. రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి.. మంచి బ్యాటింగ్ పిచ్‌పై 15 ఓవర్లలో కివీస్‌కు కేవలం 138 పరుగుల టార్గెట్ ఇచ్చి.. బాబర్ చేతులు కాల్చుకునే ప్రయత్నం చేశాడని, అది ధైర్యం కాదని, పిచ్చితనం అని పాక్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“I am sure everyone was surprised by this decision but in the back of our minds, the idea was to take a chance because when you do that, anything can happen”: Babar Azam on his decision to declare Pakistan innings on Day 5 of the 1st Test vs New Zealand #PAKvNZ pic.twitter.com/WiSqPuA1H4
— PakPassion.net (@PakPassion) December 30, 2022