భారత్-పాకిస్థాన్ మధ్య సరైన సంబంధాలు లేకపోవడంతో పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం లేదు. ఐపీఎల్ 2008 ఆరంభ సీజన్‌లో ఆడిన పాక్ ఆటగాళ్లు ఆ తర్వాత నుంచి దూరమయ్యారు. పాకిస్థాన్‌లో సూపర్ లీగ్ జరుగుతున్నా అది ఐపీఎల్ అంత పెద్ద లీగ్ కాదు. కాగా.. ఐపీఎల్ సక్సెస్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చాలా లీగ్‌లే పుట్టుకొచ్చాయి. కానీ ఏదీ ఐపీఎల్‌ను కొట్టలేకపోయింది. ఆటగాళ్లకు ఇక్కడ వచ్చేంత డబ్బు, పాపులారిటీ మరే క్రికెట్ లీగ్‌లో కూడా రాదు.
తాజాగా సౌతాఫ్రికా టీ20 లీగ్, యూఏఈ టీ20 లీగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇందులో యూఏఈ లీగ్ ఐపీఎల్ తర్వాత రెండో అతిపెద్ద క్యాష్‌రిచ్ లీగ్‌గా నిలవనుంది. దీంతో ఐపీఎల్‌లో కురిసినట్లే ఈ లీగ్‌లో కూడా ఆటగాళ్ల కోట్ల వర్షం కురవనుంది. ఈ లీగ్‌లో మొత్తం 6 ఫ్రాంచైజ్‌లు ఉన్నాయి. ఈ ఫ్రాంచైజ్‌లు ఇప్పటికే ఆటగాళ్లను ఎంపిక చేసుకునే పనిలో పడింది. అందుకోసం కోట్లకు కోట్లు కుమ్మరించేందుకు సిద్దంగా ఉన్నాయి. తాజాగా ఓ ఫ్రాంచైజ్ పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్, బౌలర్ షాహీన్ షా అఫ్రీదికి ఏకంగా రూ.12 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం.
కాగా.. యూఏఈ లీగ్‌లో ఆడే సమయంలోనే పాకిస్థాన్ వేరే దేశాలతో సిరీస్‌లు ఆడనుంది. దీంతో పాక్ తరుపున ఆడే మ్యాచ్‌లు వదులుకోవాల్సి వస్తుందని బాబర్, అఫ్రీది రూ.12 కోట్ల ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తుంది. పాక్ ఆటగాళ్లు దేశం కోసం డబ్బును తృణప్రాయంగా వదులుకోవడంపై క్రికెట్ అభిమానుల్లో ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Babar Azam and Shaheen Shah Afridi were offered 12 CRORE PKR to leave national duties and play UAE T20, They refused for National Team!#CommonwealthGames #BabarAzam #AsiaCup2022 #PAKvNED #ICCRankings pic.twitter.com/QQTxsZ6UMw
— Ginger Sports (@GingerSportsPK) August 4, 2022
ఇది కూడా చదవండి: స్టేడియంలో బతుకమ్మ ఆడిన పాకిస్థాన్, శ్రీలంక క్రికెట్ ఫ్యాన్స్!