క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుత కాలంలో విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ తర్వాత అంతటి పేరు, టాలెంట్ ఉన్న ఆటగాడు బాబర్ అజామ్. పాక్ సారధిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాకిస్తాన్ క్రికెట్ కు మంచి గుర్తింపు, పేరు తీసుకొచ్చేందుకు బాగానే కృష్టి చేశాడు. ఇటీవలి కాలంలో విరాట్ కోహ్లీకి చెందిన కొన్ని రికార్డులను సైతం బాబర్ బద్దలు కొట్టడం చూశాం. ఇటీవలే టీ20 ర్యాంకింగ్స్ లో కూడా నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే టీ20ల్లో (1000)అత్యధిక రోజులు నెంబర్ 1 స్థానంలో ఉన్న కోహ్లీ రికార్డును ఇటీవలే బ్రేక్ చేశాడు. అంతేకాకుండా అతి తక్కువ ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగులు చేయడం ఇలా కొన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. తాజాగా శ్రీలంక పర్యటనకు వెళ్తున్న పాక్ జట్టుని మీడియా కోహ్లీ రికార్డుల విషయంపై ప్రశ్నించగా కాస్త ఓవరాక్షన్ చేశాడనే చెప్పాలి.
ఒక రిపోర్టర్.. “మీరు ఇటీవలే కోహ్లీ రికార్డు బద్దులు కొట్టారు కదా” అని ప్రశ్నించాడు. అందుకు బాబర్.. “ఏది?” అని ప్రశ్నించాడు. ఆ రిపోర్టర్ “ఎక్కువ రోజులు టీ20లలో నెంబర్ వన్‌గా కొనసాగడం” అని చెప్పాడు. అందుకు బాబర్ “ఓ అదా.. ముందుగా నేను ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నా అద్భుత ప్రదర్శనల వెనుక నా కఠోర శ్రమ దాగుంది” అంటూ బాబర్ బదులిచ్చాడు.
అయితే బాబర్ తీరుపై ప్రస్తుతం కోహ్లీ, టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ‘కోహ్లీ రికార్డులు ఒకటి రెండు బ్రేక్ చేసినంత మాత్రానా.. ఏదో ప్రపంచ క్రికెట్ లో రికార్డులన్నీ నువ్వే తిరగరాస్తున్నట్లు అంత బిల్డప్ అవసరమా’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంకొంత మంది ‘కోహ్లీ ఫామ్ లో లేడు కాబ్టట్టి నీ ఆటలు సాగుతున్నాయి. అందుకని బిల్డప్ బాబాయిలా రెచ్చిపోకు’ అంటూ తిట్టి పోస్తున్నారు. బాబర్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.