వెస్టిండిస్ టూర్ ఆఫ్ పాకిస్థాన్ లో భాగంగా మూడు వన్డేల సిరీస్(రీషెడ్యూల్డ్) కొనసాగుతోంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో పాకిస్థాన్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 50 ఓవర్లలో 305 పరుగులు చేసింది. వెస్టిండీస్ నుంచి షాయ్ హోప్(127) శతకం వృథా అయ్యింది. పాకిస్థాన్ నుంచి హరిస్ రాఫ్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇంక బ్యాటింగ్ విషయానికి వస్తే బాబర్ అజామ్ ఈ మ్యాచ్ లో చేసిన సెంచరీతో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్దులు కొట్టాడు. వెస్టిండీస్ పై చేసిన శతకం(103 పరుగులు)తో అతి తక్కువ ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన కెప్టెన్ గా రికార్డుల కెక్కాడు.
అంతేకాకుండా.. ఈ మ్యాచ్ లో జరిగిన మరో ఘటన ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అదేంటంటే.. వెస్టిండీస్ ఇచ్చిన టార్గెట్ ను పాకిస్థాన్ 5 వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. మ్యాచ్ ప్రెజెంటేషన్ లో బాబర్ అజామ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచినట్లు ప్రకటించారు. చెక్కు తీసుకునేందుకు బాబర్ అజామ్ నిరాకరించాడు. చెక్కు తీసుకోకుండా ఆ టైటిల్ ను తమ జట్టులోని ఖుష్ దిల్ షా కు ఇవ్వాల్సిందిగా కోరాడు.
WHAT A WIN 👏
Multan witnesses Pakistan’s highest successful run chase against West Indies in ODIs 🙌✨#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/MOhFbgk1RF
— Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022
బాబర్ అజామ్ చెప్పడంతో ఖుష్ దిల్ షా వచ్చి బాల్ పై సంతకం చేసి.. లక్ష రూపాయల మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రైజ్ మనీ తీసుకున్నాడు. ప్రస్తుతం బాబర్ అజామ్ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కెప్టెన్ గా తన జట్టులోని సభ్యులను ఎంకరేజ్ చేస్తున్న తీరు చాలా బాగుంది అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అంతేకాకుండా కొందరైతే బాబర్ అజామ్ ను గంగూలీతో పోలుస్తూ కామెంట్ చేస్తున్నారు.
Beautiful gesture from the skipper 😍@babarazam258 gives his player of the match award to @KhushdilShah_ 🏆👏#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/7BrSiV7TyL
— Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022
నిజానికి పాక్ జట్టులో ఇంజిమముల్ హక్ తర్వాత కెప్టెన్ స్థిరంగా, నిలకడగా జట్టును నడిపిస్తున్నది బాబర్ అజామ్ ఒక్కడే. ప్రస్తుతం బాబర్ ఎంతో ముందుచూపుతో జట్టును బిల్డ్ చేస్తున్నాడు. జట్టులో ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహం నింపుతూ ఎక్కడా తగ్గకుండా ప్రతి ప్లేయర్ రాణించేలా కృషి చేస్తున్నాడు. ఇప్పుడు ఆ విషయం మీదే బాబర్ అజామ్ ను గంగూలీ పోలుస్తున్నారు.
🏏 𝟒𝟏* (23)
💥 𝟒 massive sixes
⚡ 𝟏𝟕𝟖.𝟐𝟔 strike rate🗣️ Player of the match @KhushdilShah_ reflects on his explosive knock and his power-hitting prowess 💪 #PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/bNqPo2v848
— Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022
ఇప్పుడు టీమిండియా ఈ స్థాయిలో నిలకడగా రాణించగలుగుతోంది అంటే అందుకు అప్పట్లో గంగూలీ తీసుకున్న చర్యలు, చేసిన కృషే కారణం అని ఇట్టే చెప్పచ్చు. బాబర్ అజామ్ కూడా గంగూలీనే ఫాలో అవుతూ జట్టును పటిష్టంగా నిర్మిస్తున్నాడు అంటూ కొనియాడుతున్నారు. తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ ను బాబర్ అజామ్- ఖుష్ దిల్ షాకు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
“Well done to the fans”
West Indies skipper @nicholas_47 enjoyed the response from the Multan crowd 👏#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/FGVLdDVGJC— Pakistan Cricket (@TheRealPCB) June 9, 2022