పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ కెప్టెన్సీ నైపుణ్యాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆటగాడిగా తిరుగులేని ఫామ్‌లో ఉన్న బాబర్ .. కెప్టెన్‌గా మాత్రం డిజాస్టర్ అవుతున్నాడు. అందుకే పీఎస్‌ఎల్ సాక్ష్యం..
భారత్‌లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు పోటీగా ప్రపంచ వ్యాప్తంగా చాలా లీగులే పుట్టుకొచ్చాయి. అందులో పాకిస్థాన్ సూపర్ లీగ్ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ లీగ్ 8వ సీజన్ నడుస్తోంది. గతంలో కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న బాబర్ అజమ్ ఈ సీజన్‌లో పెషావర్ జల్మీకి మారాడు. అయితే.. గత రెండు మ్యాచ్‌ల్లో బాబర్ నేతృత్వంలోని పెషావర్ జట్టు భారీ స్కోర్ చేసి కూడా ఓటమి పాలైంది. భారీ స్కోర్ 180, 200 కూడా కాదు.. 240 పైనే. టీ20 క్రికెట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 240 పైన పరుగులు చేస్తే.. విజయం ఖాయంగా చెప్పవచ్చు. కానీ.. బాబర్ కెప్టెన్సీలోని పెషావర్ జల్మీపై అయితే.. అది చాలా ఈజీ టార్గెట్‌లా మారిపోయింది.
ఈ నెల 8న క్వాట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పెషావర్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 2 వికెట్లు నష్టాపోయి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ బాబర్ అజమ్ సైతం సెంచరీతో చెలరేగాడు. అయినా కూడా పెషావర్ బౌలర్లు ఆ భారీ టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోలేక 8 వికెట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే శుక్రవారం రాత్రి ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ముందుగా బ్యాటింగ్ చేసిన పెషావర్ ఈ సారి 242 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ 39 బంతుల్లోనే 73 రన్స్ చేశాడు. గత మ్యాచ్ కంటే రెండు పరుగులు అదనంగానే స్కోర్ చేసినా కూడా పెషావర్ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో దుమ్మురేపుతున్న పెషావర్ జట్టు భారీ టార్గెట్లను సైతం డిఫెండ్ చేసుకోలేక చతికిలపడుతుంది. దీంతో ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాకిస్థాన్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న బాబర్ అజమ్ ఒక లీగ్‌లో తన కెప్టెన్సీలోని జట్టుతో కనీసం 242 పరుగులను సైతం కాపాడుకోలేకపోవడంతో అతని కెప్టెన్సీ నైపుణ్యాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే పీఎస్‌ఎల్‌లో బౌండరీ లైన్‌ను దగ్గర పెట్టుకుని భారీ పరుగులు చేస్తున్నారనే విమర్శలకు తోడు.. బాబర్ కెప్టెన్‌గా ఫెయిల్ అవుతున్నాడంటే పాకిస్థాన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలాగే ఉంటే.. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో కూడా పాకిస్థాన్‌ను బాబర్ విజయం పథంలో నడిపించలేడంటూ కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఆటగాడిగా గొప్ప పేరు సంపాదించుకున్న బాబర్ ఇప్పటి వరకు తన కెప్టెన్సీలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా పాకిస్థాన్‌కు గెలిపించలేకపోయాడు. దీంతో వన్డే వరల్డ్ కప్‌కు అతని స్థానంలో షాహీన్ షా అఫ్రిదీ కెప్టెన్‌ను చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. పీఎస్‌ఎల్ 8లో అఫ్రిదీ కెప్టెన్సీలోని లాహోర్ టీమ్ 9 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉంది. అలాగే గత సీజన్ ఛాంపియన్‌గా కూడా అఫ్రిదీ టీమే నిలిచింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Multan Sultans become the third team to qualify for the second stage of PSL 8 #PZvMS #PSL8 pic.twitter.com/BYwur7kcao
— Saj Sadiq (@SajSadiqCricket) March 10, 2023