టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అరుదైన రికార్డును పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ బద్దలుకొట్టాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం అగ్రస్థానంలో కొనసాగి కోహ్లీ రికార్డు సృష్టిస్తే.. ఇప్పుడు ఆ రికార్డును బాబర్ అజమ్ బ్రేక్ చేసి కొత్త రికార్డును నెలకొల్పాడు. విరాట్ కోహ్లీ మొత్తం 1013రోజుల పాటు టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ బ్యాటర్‌గా కొనసాగగా.. అతని రికార్డును బాబర్ బద్దలు కొట్టాడు.
బాబర్ అజామ్ 818రేటింగ్ పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతునానడు. అలాగే పాకిస్థాన్ వికెట్ కీపర్-బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 794 రేటింగ్ పాయింట్లతో 2వ స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం బ్యాడ్ ఫామ్‌లో ఉండడంతో 21వ స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది కోహ్లీ కేవలం 2 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇటీవల కోహ్లీ అన్ని ఫార్మాట్లలో భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. గత మూడేళ్లుగా టీ20 ఫార్మాట్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 300పరుగులకు మించి చేయలేకపోయాడు.
అలాగే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో ఇషాన్ కిషన్ ఒక్కడే ఉన్నాడు. ఇటివల 6వ స్థానానికి చేరుకున్న ఇషాన్ కిషన్.. ఒక స్థానం కోల్పోయి 7వ స్థానానికి పడిపోయాడు. ఇషాన్ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో మంచిగా రాణించాడు. కానీ ఐర్లాండ్‌తో ఇటీవల ముగిసిన 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మాత్రం తన ఫామ్ చూపించలేకపోయాడు. ఇక కేఎల్ రాహుల్ బ్యాటర్ల లిస్టులో 17వ స్థానంలో ఉండగా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 19వ స్థానంలో కొనసాగుతున్నాడు.
ఐర్లాండ్ యువ సంచలనం హ్యారీ టెక్టర్ ఇటీవల ఇండియాతో టీ20 సిరీస్లో రాణించిన సంగతి తెలిసిందే. దీంతో అతను 55స్థానాలు ఎగబాకి 66వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఐర్లాండ్ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన దీపక్ హుడా 414 స్థానాలు ఎగబాకి 104వ ర్యాంకుకు చేరుకున్నాడు. కాగా విరాట్ కోహ్లీ సరైన ఫామ్‌లో లేకపోవడంతోనే బాబర్ ఈ రికార్డును సాధించగలిగాడని… కింగ్ కోహ్లీ ఒక్కసారి ఫామ్ పుంజుకుంటే రికార్డులన్ని తుడిచిపెట్టుకునిపోతాయని కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Pakistan captain Babar Azam adds another feather to his cap 🙌
Details ⬇️https://t.co/f9zhA1Dgs1
— ICC (@ICC) June 30, 2022