టీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరిగా శుభవార్తలు చెబుతూ ఉన్నారు. ఇటీవలే కేఎల్ రాహుల్- అతియా శెట్టి వివాహం చేసుకోగా.. ఇప్పుడు స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా ఓ ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన మేహా పటేల్ కు మూడు ముళ్లు కట్టేశాడు. జనవరి 26న వడోదరాలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 2022లో అక్షర్ పటేల్ తన గర్ల్ ఫ్రెండ్ మేహాకి పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. జనవరి 20న వీళ్ల నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఏడడుగులు వేశారు. ఎంతో గ్రాండ్ గా వీరి పెళ్లి జరిగింది. వారి వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అక్షర్ పటేల్- మేహా పటేల్ వివాహం జనవరి 26న వడోదరాలో వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ ప్రేమ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హిందూ సంప్రదాయంలో వీరి వివాహ తంచు సాగింది. పెళ్లికి ముందు కాబోయో వధూవరులు ఇద్దరూ కలిసి స్టేజ్ పై ఓ పాటకు అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేశారు. సూపర్ హిట్ మాన్ మేరీ జాన్ అనే పాటకు వాళ్లు డాన్స్ చేశారు. వారు వేసిన స్టెప్పులు చూసి బంధు, మిత్రులు మురిసిపోయారు. అక్షర్ పటేల్ పెళ్లికొడుకుగా ముస్తాబయ్యి మండపానికి వచ్చే వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బరాత్ లో డాన్సులు వేసుకుంటూ అక్షర్ పటేల్ మండపానికి చేరుకున్నాడు.
Congratulations @akshar2026 & Meha Patel 😍🎉❤️#AxarPatel #AxarPatelWedding pic.twitter.com/klqK0PNkie
— Rohit Kumar Gupta (@iamrkgupta) January 26, 2023
అక్షర్ పటేల్- మేహా పటేల్ వివాహ వేడుకకు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ హాజరయ్యాడు. నూతన వధూవరులను ఆశీర్వదించాడు. ఈ పెళ్లిలో జయదేవ్ ఉనడ్ కట్ తన భార్యతో కలిసి సందడి చేశాడు. వీరి పెళ్లి గురించి ఉనడ్ కట్ సోషల్ మీడియాలో హింట్ ఇచ్చాడు. ముందే వారి ఫొటోలను షేర్ చేశాడు. గతేడాదిగా అక్షర్- మెహా ఇద్దరూ కలిసున్న ఫొటోలను షేర్ చేస్తూనే ఉన్నారు. నిశ్చితార్థం తర్వాత సోషల్ మీడియా వేదికగా అన్నీ అప్ డేట్స్ కలిసే ఇస్తున్నారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అక్షర్ పటేల్ పాల్గొననున్నాడు.
अक्षर पटेल और उनकी पत्नी मेहा का संगीत सेरेमनी में खूबसूरत डांस परफॉरमेंस
Axar Patel & His Wife Meha Dance Performance at Sangeet Ceremony#axarpatel #AxarPatelWedding #cricketer #cricket #weddingdance #wedding #indvsnz pic.twitter.com/KF7RlGqdYo
— Shivam शिवम (@shivamsport) January 26, 2023