శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ చేసిన పోరాటంపై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. బౌలింగ్‌లో రెండు వికెట్లతో రాణించిన అక్షర్.. బ్యాటింగ్‌లోనూ వీరోచితంగా పోరాడాడు. 57 పరుగులకే 5 కీలక వికెట్లు పడిపోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్.. క్రీజ్‌లో ఉన్న మిస్టర్ 360 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను సైతం మర్చిపోయేలా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇంతసేపు టీమిండియా బ్యాటర్లు ఇబ్బంది పడిన పిచ్‌పైనేనా అక్షర్ ఆడేది.. అనే అనుమానం కలిగేలా బ్యాటింగ్ చేశాడు. అక్షర్ ఆడుతుంటే.. కొండంత లక్ష్యం సైతం చిన్నబోయినట్లు కనిపించింది. కానీ.. అప్పటికే రిక్వర్డ్ రన్‌రేట్ భారీగా పెరిగిపోవడంతో టీమిండియాకు విజయం దక్కలేదు. కానీ.. టీమిండియా ఇన్నింగ్స్ సగం పూర్తి అవ్వగానే మ్యాచ్ గెలిచేశామనే భ్రమలో ఉన్న లంక ఆటగాళ్ల ముఖం నీళ్లు కొట్టినట్లు సిక్సుల కొట్టి మరీ నిద్రలేపాడు.
ముఖ్యంగా శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్ టీ20 బౌలర్ వనిందు హసరంగాను అయితే అక్షర్ పిచ్చికొట్టుడు కొట్టాడు. హసరంగా వేసిన అతని మూడో ఓవర్‌లో తొలి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాది ఔరా అనిపించాడు. అక్షర్ బ్యాటింగ్‌కు హసరంగా సైతం ఆశ్చర్యపోయాడు. అవి మూడు కూడా మామూలు సిక్సులు కావు.. భారీ భారీ సిక్సులు. అక్షర్‌తో పాటు అదే ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ సైతం ఒక సిక్స్ కొట్టడంతో ఆ ఓవర్‌లో మొత్తం 26 పరుగులు వచ్చాయి. అంతకు ముందు హసరంగా రెండో ఓవర్‌లోనూ అక్షర్ ఒక సిక్సు బాదాడు. మొత్తం మీద హసరంగా బౌలింగ్‌లో అక్షర్ మొత్తం 4 సిక్సులు బాదాడు. 31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సులతో 65 పరుగులు చేసిన అక్షర్ చివరి ఓవర్ మూడో బంతికి అవుట్ అయ్యాడు.
ఇక అక్షర్ పటేల్ దెబ్బకు టీ20 క్రికెట్‌లో ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా ఉన్న హసరంగా తన 4 ఓవర్ల కోటాను సైతం పూర్తి చేయలేకపోయాడు. కేవలం 3 ఓవర్లు మాత్రమే వేసి గమ్మున ఉండిపోయాడు. చివరి ఓవర్‌ను తప్పని పరిస్థితుల్లో లంక కెప్టెన్ షనక వేయాల్సి వచ్చింది. అక్షర్ పటేల్ బ్యాటింగ్‌తో హసరంగా 3 ఓవర్లలో 41 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3, అక్షర్ పటేల్ 2, చాహల్ ఒక వికెట్ తీసుకున్నారు. లక్ష్యఛేదన దిగిన భారత్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 190 రన్స్ చేసి 16 రన్స్ తేడాతో ఓడింది. అక్షర్ పటేల్ 65, సూర్యకుమార్ యాదవ్ 51, శివమ్ మావీ 26 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలం అవ్వడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. మరి ఈ మ్యాచ్‌లో హసరంగా బౌలింగ్‌లో అక్షర్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sixes | Axar – Sky 🔥 #axarpatel #SuryakumarYadav #Sixers #T20 #indiavsrilanka pic.twitter.com/ObNvM91tKI
— Kanhiya Singh (@Kanhiya99438536) January 6, 2023