ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా పోరాడుతోంది. అయితే.. సిరీస్‌కు ముందు పంత్ లేడనే భయాన్ని తాజాగా ఓ ఆల్‌రౌండర్ తగ్గిస్తున్నాడు. పంత్‌లా ఫియర్‌లెస్ క్రికెట్ ఆడుతూ.. హేమాహేమీలు విఫలమైన చోట.. జట్టుకు ఆపద్బాంధవుడిలా మారుతున్నాడు.
భారత క్రికెట్ అభిమానులు ప్రస్తుతం అసలు సిసలైన మజాను పొందుతున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 కోసం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న పోటీని ఆస్వాదిస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే ముగిసిన తొలి టెస్టును అతిథ్యం జట్టు భారత్ గెలిచి.. నాలుగు వన్డేల సిరీస్‌కు మంచి స్టార్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో రెండో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇరు హోరాహోరీగా తలపడుతున్నాయి. సెషన్ సెషన్‌కు ఆధిపత్యం మారుతూ వస్తోంది. కాగా.. ప్రస్తుతం టీమిండియా ముందున్న ప్రధాన లక్ష్యం.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకోవడం ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరడమే. అందుకోసమే.. ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా చాలా సీరియస్‌గా తీసుకుంది.
అయితే.. ఇంత ఇంపార్టెంట్ సిరీస్‌కు ముందు టీమిండియాను కలవరపర్చిన విషయం ఒకటుంది. అది రిషభ్ పంత్ టీమ్‌లో లేకపోవడం. దురదృష్టవశాత్తు గత నెలలో పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. టెస్టు క్రికెట్‌లో, అందులోనే ఆస్ట్రేలియాపై అద్భుత రికార్డు కలిగి ఉన్న పంత్.. జట్టులో లేకపోవడం భారత్‌కు పెద్ద దెబ్బగానే అంతా భావింంచారు. నిజానికి అది అక్షర సత్యం కూడా. గతంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2021ని టీమిండియా కైవసం చేసుకుందంటే ప్రధాన కారణం పంత్. ఆస్ట్రేలియా గడ్డ గాబాలో పంత్ ఆడిన ఇన్నింగ్స్ భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒక మరుపురాని ఇన్నింగ్స్‌గా గుర్తుండి పోతుంది. అలాంటి ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడు ఇప్పుడు టీమ్ లేడంటే అది కచ్చితంగా లోటే.
ఈ భయంతోనే తొలి టెస్టులో బరిలోకి దిగిన టీమిండియా.. అనుకున్నట్లే మధ్యలో తడబడింది. టాపార్డర్‌లో రోహిత్ శర్మ ఒక్కడే సెంచరీతో రాణించడగా.. మిడిల్డార్ మొత్తం చేతులెత్తేసింది. కానీ.. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్.. భారత ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలిచారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని టీమిండియాకు 400 పరుగుల స్కోర్ అందించారు. దీంతో.. టీమిండియా ఈ మ్యాచ్‌ను ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ 84 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టులోనూ సంచలన బ్యాటింగ్ చేశాడు. కోహ్లీ మినహా టీమిండియా బ్యాటింగ్ లైనప్ మొత్తం విఫలమైన చోట విరోచితంగా పోరాడాడు.
115 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 74 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్‌కు బ్యాక్‌బోన్‌గా మారాడు. ఇలా రెండు వరుస ఇన్నింగ్స్‌ల్లో రెండో హాఫ్ సెంచరీలతో టీమిండియాకు ఆపద్బాంధవుడిలా ఆదుకున్నాడు. పైగా రెండు సార్లు కూడా టీమిండియా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంల్లోనే అక్షర్ ఒత్తిడికి తట్టుకుని అద్భుతంగా ఉండాడు. పంత్ లేని లోటును ఎవరైనా తీరుస్తున్నారా? అంటే అది కచ్చితంగా అక్షర్ పటేల్ అనే చెప్పాలి. బౌలింగ్ విషయం పక్కన పెడితే.. లోయర్ ఆర్డర్‌లో టీమిండియాకు నమ్మకంగా ఆడుతున్నాడు. పైగా పంత్ ఆడినట్లే.. ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతూ.. అవసరమైనప్పుడు భారీ షాట్లతో ఎదురుదాడికి దిగుతున్నాడు. ప్రస్తుతం రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా నిలబడి, పోరాటం చేసిందంటే.. అందుకు అక్షర్ పటేలే కారణం. మరి అక్షర్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Axar Patel’s batting has been a massive plus point for India. pic.twitter.com/DcP3aGXUMR
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 18, 2023
5⃣0⃣ & counting ✅@akshar2026 smacks a MAXIMUM to bring up his half-century in style 👌🏻👌🏻
Follow the match ▶️ https://t.co/hQpFkyZGW8…#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/noVvVrEbAX
— BCCI (@BCCI) February 18, 2023